నా భార్యకు డ్రైవర్ తో ఎఫైర్ ఉంది: నరేష్ షాకింగ్ కామెంట్స్..!

Fri Jul 01 2022 22:45:12 GMT+0530 (IST)

Actor Naresh about her wife

ప్రస్తుతం కన్నడ తెలుగు ఇండస్ట్రీలలో ప్రముఖ నటుడు నరేష్ - పవిత్రా లోకేష్ మధ్య రిలేషన్ హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్.. మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో ఇప్పుడు పవిత్రతో నాలుగో పెళ్లికి రెడీ అయ్యారని కన్నడ మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి నరేష్ - పవిత్ర లపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కన్నడ మీడియాతో మాట్లాడారు నరేష్.



''నేను మనిషిని. నాకు ఓ ఎమోషనల్ సపోర్టు కావాలి.. స్నేహం కావాలి. నేను ఓ సినిమా సమయంలో పవిత్రా లోకేష్ ను కలిశాను. మేము ఫ్రెండ్స్ మాత్రమే. పరస్పరం మా కష్టసుఖాలు మాట్లాడుకున్నాం. అలా ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ అయింది.. నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయింది. అందరూ అంటున్నట్లుగా ఆమె నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నింటిలో ఉంటుంది. ‘రమ్యా.. ఫ్యామిలీ ఫంక్షన్లలో నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడో ఎవరితోనో ఉన్నావు? అదంతా నేను చెప్పాలనుకోవటం లేదు'' అని నరేష్  అన్నారు.

ఈ క్రమంలో తన మూడో భార్య రమ్యా గురించి నరేశ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె తనకు భార్యలా ఏనాడూ ప్రవర్తించలేదని.. బాబు పుట్టిన ఏడాది తర్వాత తన క్యారక్టర్ బయటపడిందని.. ఆ విషయాలు చెబితే మహిళలందరూ బాధ పడతారని అన్నారు. ఆమె దగ్గర ఒక హ్యాండ్సమ్ ముస్లిం డ్రైవర్ పని చేస్తాడని.. అతనితో ఎఫైర్ పెట్టుకుందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు.

ముగ్గురు మహిళలు కలిసి ఊటీ గెస్ట్ హౌస్ కు వెళ్లారని.. అక్కడ కొన్ని బ్యాడ్ సంఘటనలు జరిగాయని.. అవి ప్రెస్ ముందు నేను చెప్పలేనన్నారు. తన స్టాఫ్ ద్వారా ఈ విషయం తెలిసిందని చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే అబద్ధపు వివరణలు ఇచ్చిందని చెప్పారు. ఇలా తనని వేధించిందని.. ఇవన్నీ ఎంతో బాధించాయని నరేష్ పేర్కొన్నారు.

ఓసారి ఇంట్లో ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆమె ఫుల్ గా తాగి మేల్ క్యాబరే డ్యాన్సర్ ని తీసుకొచ్చిందని చెప్పారు నరేష్. తాను ఒక యాక్టర్ గా అందరికీ తెలుసని.. గూగుల్ లో వెతికినా పెళ్లిళ్ల గురించి వార్తలు తప్ప.. తనపై ఒక్క సెక్స్చ్యువల్ హరాష్మెంట్ ఆరోపణ కూడా ఉండదన్నారు. తన లైఫ్ తనకు కావాలని.. అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని నరేష్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే పవిత్ర - నరేశ్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన వద్ద డబ్బు లేదని.. ఇద్దరు పిల్లలున్నా కూడా పవిత్ర తనను వదిలేసి వెళ్లిపోయిందన్నాడు. ఆమెకు కాపురాలు కూల్చటం అలవాటేనని.. డబ్బు లగ్జరీ లైఫ్ కావాలనే ఆశ ఆమెలో బలంగా కూరుకుపోయిందని ఆరోపించాడు. ఒకవేళ నరేశ్ ను పెళ్లి చేసుకున్నా ఆరు నెలల్లో అతని డబ్బు స్వాహా చేసి వదిలేస్తుందని సురేంద్ర తెలిపాడు.

అయితే తన భర్తగా చెప్పుకుంటున్న కన్నడ దర్శకుడు సుఖేంద్ర ప్రసాద్ ను తాను పెళ్లి చేసుకోలేదని.. తమకు అధికారికంగా పెళ్లి జరగలేదని పవిత్ర లోకేష్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు రమ్య రఘుపతి మాట్లాడుతూ నరేష్ తో తన వైవాహిక బంధం ఇంకా తెగిపోలేదని.. తాను విడాకుల పేపర్లపై సంతకం చేయలేదని చెబుతోంది. ఇప్పటికీ తాను నరేష్ భార్యనే అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని అంటోంది.