Begin typing your search above and press return to search.

షూటింగ్ లో ప్ర‌మాదం.. స్టార్ హీరోకు తీవ్ర గాయం!

By:  Tupaki Desk   |   4 March 2021 6:30 AM GMT
షూటింగ్ లో ప్ర‌మాదం.. స్టార్ హీరోకు తీవ్ర గాయం!
X
సినిమా క‌థ క‌ల్పిత‌మే అయినా.. యాక్ష‌న్ మాత్రం ఒరిజిన‌ల్‌. ఇక‌, ఫైట్లు.. ఛేజ్ లు అత్యంత ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో షూట్ చేస్తుంటారు. అయితే.. పాత త‌రంలో రిస్కీ స్టంట్స్ చేయ‌డానికి ఎక్కువ‌గా డూప్ క్యారెక్ట‌ర్ల‌ను యూజ్ చేసేవారు. కానీ.. ఈ త‌రంలో ప‌రిస్థితి మారిపోయింది. డూప్ ను వాడ‌డానికి యాక్ట‌ర్స్ పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ట్లేదు.

సీన్ లో ఎంత రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ.. తామే ఒరిజిన‌ల్ గా చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. దాదాపుగా ఒరిజిన‌ల్ గానే సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. అయితే.. ఈ క్ర‌మంలో కొంద‌రు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. గ‌తంలోనూ ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి. అయితే.. తాజాగా మ‌రో స్టార్ హీరో గాయ‌ప‌డ్డారు. షూటింగ్ లో భాగంగా జ‌రిగిన ప్ర‌మాదంలో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ కు తీవ్ర గాయమైంది.

ప్ర‌స్తుతం ఆయ‌న ‘మలయన్ కుంజు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా.. ఓ ఇంటి సెట్ ను నిర్మించారు. ఇందులో సీన్ ఏమంటే.. కూలిపోతున్న ఆ ఇంట్లో నుంచి ఫాజిల్ త‌ప్పించుకోవాలి. ఈ సీన్ షూట్ చేస్తుండ‌గా.. స‌కాలంలో బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు ఫ‌హ‌ద్‌. ఇంటి నుంచి బ‌య‌ట‌కు దూకే స‌మ‌యంలో ప‌ట్టుత‌ప్పి, అందులోనే ప‌డిపోయారు.

ఈ ప్ర‌మాదంలో ఫాజిల్ ముక్కుకు పెద్ద గాయ‌మైంద‌ని స‌మాచారం. వెంట‌నే స్పందించిన యూనిట్ స‌భ్యులు.. ఆయ‌న‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. గాయం పెద్ద‌దే అయిన‌ప్ప‌టికీ.. ఫాజిల్ కు ప్ర‌మాదం లేద‌ని వైద్యులు చెప్పార‌ట. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే అభిమానులు, ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఫాజిల్ ఆరోగ్యంపై ఆరాతీస్తున్నారు.