నటుడు బ్రహ్మాజీ నిజంగా గ్రేట్

Tue Aug 16 2022 17:07:58 GMT+0530 (IST)

Actor Brahmaji is really great

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇప్పటికే ఎన్నో వందల సినిమాల్లో నటించాడు. ఇప్పటికి కూడా ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆయన చేతిలో మినిమం గా పది సినిమాల వరకు ఉంటాయి అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభం కంటే ఈ మధ్య కాలంలో మరింతగా బిజీ అయిన బ్రహ్మాజీ ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు కూడా చాలా సరదాగా ఉంటుంది.ఇంటర్వ్యూ అయిన.. టాక్ షో అయినా కూడా బ్రహ్మాజీ ఎప్పటిలాగే చాలా రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. మూడు పదుల ఏళ్ల సినీ ప్రస్థానం కలిగిన బ్రహ్మాజీ తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. నటుడిగా చెన్నైలో ప్రయత్నాలు చేస్తున్న సమయం లోనే బెంగాళి అమ్మాయితో పరిచయం అయ్యి ఆమెను పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి అయిన తర్వాత బ్రహ్మాజీ పిల్లలను వద్దు అనుకున్నాడట. అందుకు కారణం అప్పటికే ఆమెకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నే తన కొడుకుగా స్వీకరించి సొంత కొడుకుగా చూసుకున్నాడు.

అందుకే మళ్లీ పిల్లలు అక్కర్లేదు అనుకున్నాడట. ఈ విషయం తెలిసి చాలా మంది బ్రహ్మాజీ గ్రేట్ అంటున్నారు. ఈ విషయాన్ని బ్రహ్మాజీ గతంలో ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇన్నాళ్లకు ఈ విషయాన్ని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఆ మధ్య పిట్టకథ అనే సినిమా తో కొడుకు సంజయ్ ని బ్రహ్మాజీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. నటుడిగా అతడికి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఇప్పటి వరకు తదుపరి సినిమా ను ప్రకటించలేదు. బ్రహ్మాజీ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కామెడీ పాత్రలను మాత్రమే కాకుండా విలన్ పాత్రను చేయడం లో కూడా ఆయనకు ఆయనే సాటి అంటూ కొన్ని పాత్రలను చూస్తే అనిపిస్తుంది.

మొన్నటికి మొన్న డీజే టిల్లు సినిమాలోని కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించిన తీరు నిజంగా ఆకట్టుకుంది. ది వారియర్ సినిమాలో కూడా కన్నింగ్ పోలీస్ గా కనిపించి మెప్పించాడు. చిన్న పాత్రల్లో అయినా కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్రలు చేస్తూ కెరీర్ లో బిజీ బిజీగా బ్రహ్మాజీ దూసుకు పోతున్నాడు.