Begin typing your search above and press return to search.

ఆలియాభట్ పై ఆన్ లైన్ దాడి ఆపండి

By:  Tupaki Desk   |   25 Sep 2021 12:30 PM GMT
ఆలియాభట్ పై ఆన్ లైన్ దాడి ఆపండి
X
హిందీలో వివాదాస్పద చిత్రాలకు కొదవ లేదు. ఇటీవల సీరియస్ సబ్జెక్ట్ లతో తీస్తున్న సినిమాలన్నీ కూడా అలాగే వస్తుంటాయి. ఆలియా భట్ ‘కన్యాదానం’ సినిమా కూడా తాజాగా వివాదంలో ఇరుక్కుంది. ఆమె చేసిన ఓ అడ్వటైజ్ మెంట్ ఇప్పుడు ట్రోలింగ్ కు కారణం అవుతోంది. ఆడపిల్ల వస్తువేం కాదు.. దానం చేయడానికి అనేది సదురు ప్రకటన సారాంశం.

యాడ్ లో భాగంగా ఆలియా భట్ ‘కన్యాదాన్ కాదు కన్యామాన్’ అనే డైలాగ్ చెబుతోంది. దాని వల్లే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతోంది. ఆలియా భట్ హిందూ సంస్కృతిని కించపరిచిందంటూ హిందూ వాదులు గొడవ చేస్తున్నారు.

ఆలియాభట్ కు ఆన్ లైన్ లో సెగ ఎదురుకావడంతో ఆమె ఆన్ స్కీన్ తండ్రి అండగా నిలిచాడు. ప్రస్తుతం వివాదాస్పదమైన వీడియోలో ఆమెకు నాన్నగా నటించాడు విజయ్ ఆనంద్. అయితే ఆయన ఆలియా తప్పేం లేదంటున్నాడు. తను డైరెక్టర్ చెప్పమన్నట్టు చెప్పిందే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా ఏమీ మాట్లాడలేదని వెనకేసుకొచ్చాడు. కాకపోతే నటీనటులు దర్శకుడు చెప్పమన్నట్టే చెబుతారు.. తమ స్వంతంగా ఏదీ మాట్లాడేయరు. ఈ విషయం ట్రోల్ చేసే వారికి తెలియదంటారా? అయినా ఆలియానే వారు టార్గెట్ చేస్తున్నారు.

ఆలియా భట్ స్టార్ హీరోయిన్. కోట్లాది మంది ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీలు ఫలానా మతం, కులం, సంప్రదాయం లేదా వర్గం గురించి కామెంట్ చేసే ముందు .. కాస్త ఆలోచించి అడుగు ముందుకేస్తేనే ఎంతైనా మంచిది.. లేదంటే వివాదాలు తప్పవు మరి..