Begin typing your search above and press return to search.

ఖిలాడీ వేటలో స్మార్ట్ పోలీసాఫీసర్ గా యాక్షన్ కింగ్..!

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:30 PM GMT
ఖిలాడీ వేటలో స్మార్ట్ పోలీసాఫీసర్ గా యాక్షన్ కింగ్..!
X
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''ఖిలాడి''. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ప్లే స్మార్ట్' అనేది ట్యాగ్ లైన్. ఇందులో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారనే సంగతి తెలిసిందే.

'ఖిలాడి' మేకర్స్ తాజాగా అర్జున్ పాత్రకు సంబంధించిన విశేషాలు వెల్లడిస్తూ.. సీనియర్ నటుడి లుక్ ని రివీల్ చేశారు. ఇందులో ఆయన అర్జున్ భరద్వాజ్ అనే పవర్ ఫుల్ ఆఫీసర్ గా కనిపిస్తారని తెలిపారు. అర్జున్ పాత్ర కూల్ యాటిట్యూడ్ తో ఉంటుందని వెల్లడించారు. స్మార్ట్ ప్లేకి స్మార్ట్ గైస్ కావాలి అంటూ వదిలిన పోస్టర్ లో యాక్షన్ కింగ్ చేతిలో గన్ పట్టుకొని ఇంటెన్స్ అండ్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

ఇకపోతే 'ఖిలాడి' చిత్రంలో ఉన్ని ముకుందన్ - అనసూయ భరద్వాజ్ - ముఖేష్ రుషి - వెన్నెల కిషోర్ - రావు రమేష్ - మురళీ శర్మ - నికితిన్ ధీర్ - ఠాకూర్ అనూప్ సింగ్ - సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో రవితేజ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.

జయంతీలాల్‌ గడ పెన్ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్‌ ప్రొడక్షన్స్‌ - ఎ స్టూడియోస్‌ బ్యానర్స్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుజిత్ వాసుదేవ్‌ మరియు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. గాంధీ న‌డికుడిక‌ర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా.. అమ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌ గా వర్క్ చేశారు. దేవిశ్రీ సోద‌రుడు సాగ‌ర్‌ మరియు శ్రీ‌కాంత్ విస్సా కలసి సినిమాలో డైలాగ్స్ రాశారు. 2022 ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా 'ఖిలాడి' చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు