డాటర్ ని స్టార్ ని చేయాలన్నదే? యాక్షన్ కింగ్ డ్రీమ్!

Thu Jun 30 2022 08:00:02 GMT+0530 (IST)

Action King Arjun About Her Daugther To Make Star Heroin

యాక్షన్ కింగ్ అర్జున్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యా అర్జున్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇప్పటివరకూ తెలుగులో సినిమాలు చేయకపోయినా?  ఇతర భాషల్లో ఎంట్రీ ద్వారా నోన్ భామగానే చెప్పాలి. అయితే హీరోయిన్ గా తమిళ్ లో ఎంట్రీ ఇచ్చినా అమ్మడి కెరీర్ ఆశించిన విధంగా సాగలేదు. దాదాపు దశాబ్ధం క్రితమే విశాల్ సరసన ఓ సినిమాలో హీరోయిన్ గా నటించింది.కానీ ఆ సినిమా అంచనాల్ని అందుకోలేదు. ఆ తర్వాత రెండవ సినిమా చేయడానికి ఏకంగా ఐదేళ్లు సమయం పట్టింది. మరి ఈ గ్యాప్ కావాలని తీసుకుందా? అవకాశాలు లేక వచ్చిందా? అన్నది  క్లారిటీ లేదు. ఆ తర్వాత  సొంత భాష కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమ బరాహ్' అనే సినిమాలో నటించింది. అదే ఏడాది కోలీవుడ్ లో మరో సినిమా చేసింది.

ఆ రెండు కూడా అంచనాలు అందుకోలేదు. ఐశ్వర్య సినిమా కెరీర్ 2013-2018 మధ్య ఇలా సాగింది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తీసుకుందని తాజాగా లాంచ్ అయిన తెలుగు సినిమా అప్ డేట్ ని బట్టి తెలుస్తోంది. ఇటీవలే విశ్వక్ సేన్ హీరోగా ఓ సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్.

ఈ చిత్రాన్ని ఐశ్వర్య తండ్రి ..నటుడు అర్జున్  స్వీయా దర్శకత్వంలో  నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడే కుమార్తె కెరీర్ విషయంలో అర్జున్ ఎంత సీరియస్ గా ఉన్నారు? అన్నది అద్దం పడుతుంది. కన్నడ..తమిళ్ లో ఐశ్వర్య సక్సెస్ అవ్వలేదు. దీంతో టాలీవుడ్ లోనైనా సక్సెస్ చేసి పెద్ద హీరోయిన్ గా తండ్రి చూసుకోవాలన్న ఆరాటం కనిపిస్తుంది.

పైగా తెలుగు సినిమా క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి రీచ్ అయింది. బాలీవుడ్ తర్వాత వందల కోట్ల వ్యాపారం సౌత్ నుంచి తెలుగు ఇండస్ర్టీలో జరగడం విశేషం. ఇవన్నీ బేరీజు వేసుకునే అర్జున్ కుమార్తెని ఇక్కడ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆ సినిమా లాంచింగ్ కూడా పూర్తయింది. ఇంత వరకూ బాగానే ఉంది.

కానీ సక్సెస్ అనేది చేతుల్లో లేదు. ఇక్కడ చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అసలు కన్నడ...కోలీవుడ్ లో ఐశ్వర్య ఎందుకు సక్సెస్ అవ్వలేదు? ఆమె నటించిన రెండు సినిమాలకు  తండ్రి అర్జున్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు తెలుగు సినిమాకు మరోసారి ఆయనే ఆ బాధ్యతలు తీసుకున్నారు. మరో ఛాన్స్ లేక తానే డబ్బు పెట్టి ఇక్కడ కుమార్తెని లాంచ్ చేస్తున్నారు.

కానీ నిరూపించుకోవాల్సింది ఐశ్వర్య. ట్యాలెంట్ తో పాటు.. నటిగా రాణించాలంటే అదనంగా కొన్ని క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండాలి. మరి అవన్నీ ఐశ్వర్యా అర్జున్ లో ఉన్నాయా?   లేవా? తండ్రి డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేస్తుందా?  అన్నది టాలీవుడ్ ఇంకొన్ని నెలల్లోనే డిసైడ్ చేస్తుంది.