సిద్ధ స్టార్ట్ చేస్తే ఆచార్య ముగిస్తాడు!

Mon Nov 29 2021 12:33:50 GMT+0530 (IST)

Acharya will finish if Siddha starts

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన చిత్రం `ఆచార్య`. అపజయమెరుగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ - పూజా హెగ్డే కథానాయికలు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పాన్ ఇండియా చిత్రాలు `ఆర్.ఆర్.ఆర్`..`రాధే శ్యామ్` రిలీజ్ కి రెడీ అవ్వడంతో `ఆచార్య` వెనక్కి తగ్గింది. దీనికి తోడు ఇప్పటివరకూ సినిమాకు బజ్ తీసుకురావడంలో యూనిట్ శ్రద్ధ వహించలేదు. రిలీజ్ కి ఇంకా సమయం ఉండటంతో ప్రచారం పై ఫోకస్ పెట్టలేదు. అయితే ఆదివారం రామ్ చరణ్ సిద్ధ పాత్రని రివీల్ చేస్తూ ఓ టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా స్కైని టచ్ చేయడం మొదలైంది. టీజర్ అంచనాల్ని పెంచేసింది. కొరటాల ఏదో అద్భుతం చేయబోతున్నాడు! అన్న టాక్ మొదలైంది. ముఖ్యంగా చిరుతని.. చిరుత పిల్లని చిరంజీవి.. చరణ్ లతో పోలుస్తూ తీసిన చివరి షాట్ ఫ్యాన్స్ కి పునకాలు తెప్పిస్తోంది.

ఇలాంటి సన్నివేశాలు బిగ్ స్క్రీన్ పై చూస్తే అన్ స్టాపబుల్ ఎంటర్ టైన్ మెంట్ ఖాయమన్న చర్చ సాగుతోంది. ఇప్పటివరకూ సైలెంట్ గా ఉన్న టీమ్ ఒక్కసారిగా ఇలాంటి టీజర్ మార్కెట్ లోకి తీసుకురావడంతో ట్రేడ్ నిపుణుల్లోనూ అంచనాలు పీక్స్ కి చేర్చుతున్నాయి. ఇలాంటి సర్ ప్రైజింగ్ సన్నివేశాలు కొరటాల మార్క్ ట్రీట్ తో ఆకట్టుకోవడం ఖాయమన్న చర్చ సాగుతోంది.

ఇక టీజర్.. ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటాయోనన్నఅంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఆచార్య అంచనాలు సంచలనాల దిశగా పరుగులు పెట్టడం ఖాయం. ఇందులో కాజల్ అగర్వాల్.. పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.