వెంకీ నుంచి బాలయ్య వైపుకి షిఫ్ట్ అవుతున్న చిరంజీవి..?

Mon Mar 01 2021 18:00:01 GMT+0530 (IST)

Acharya Release Date postponed?

టాలీవుడ్ లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది క్రేజీ మూవీస్ మధ్య క్లాషెస్ ఏర్పడుతున్నాయి. కరోనా నుంచి బయటపడి ఇండస్ట్రీలో సాదారణ పరిస్థితులు నెలకొనడంతో మేకర్స్ అందరూ పోటీపడి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి - విక్టరీ వెంకటేష్ సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొనే సిచ్యుయేషన్ వచ్చింది. ముందుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'నారప్ప' ని మే 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' సినిమాని మే 13న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరు సూపర్ సీనియర్ స్టార్ హీరోలు మధ్య బాక్సాఫీస్ వార్ లో చిరు దే పైచేయి అవుతుందని అంతా అనుకున్నారు. అయితే సినీ వర్గాల్లో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'ఆచార్య' రేసు నుంచి తప్పుకోనున్నాడట.సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై రామ్ చరణ్ - నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆచార్య' సినిమా మే 13న విడుదలయ్యే అవకాశాలు చాలా తక్కువ అని టాక్ నడుస్తోంది. 'నారప్ప' ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉండగా.. 'ఆచార్య' ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో మే 13 నుంచి 'ఆచార్య'ను మే 28కి షిఫ్ట్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ఇక్కడ చిరుకి సోలో డేట్ దొరకదు. ఎందుకంటే మే 28న బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న 'బిబి 3' విడుదల అవుతుంది. అలానే రవితేజ 'ఖిలాడి' సినిమాని కూడా అదే తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. రవితేజ సంగతి పక్కన పెడితే బాలకృష్ణ మాత్రం అదే డేట్ కి రావాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆచార్య కూడా అదే తేదీకి రావాలని చూస్తే మాత్రం దశాబ్దాలుగా బాక్సాఫీస్ ప్రత్యర్థులుగా ఉన్న చిరు - బాలయ్య మధ్య పోటీ ఈ ఏడాది మరోసారి వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో విడుదల తేదీల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.