రూల్స్ బ్రేక్ చేసి దూసుకొస్తున్న 'ఆచార్య'

Fri May 13 2022 19:04:55 GMT+0530 (IST)

Acharya On Amazon Prime

సినిమా హిట్ అయితే గనుక థియేటర్లో ఎన్ని రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడుతుందో చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వసూళ్లు బాగుంటే ..కౌంటర్ లో టిక్కెట్ లు జోరుగా అమ్ముడు పోయి లాభాలు వస్తుంటే వీలైనన్ని రోజులు థియేటర్లో ఆడించడానికి ప్రయత్నిస్తారు. ఇటీవలే రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` థియేటర్లో అలాగే ఆడేసింది.ఓటీటీ రిలీజ్ సాధారణ గడువు కన్నా ముందుగా రిలీజ్ చేయకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. థియేటర్ రన్నింగ్ బాగుంది కాబట్టి సినిమాని అన్ని రోజుల పాటు కొనసాగించగలిగారు. అటుపై రిలీజ్ అయిన `కేజీఎఫ్-2` కూడా అదే వేవ్ లో ఉంది. థియేటర్ ఆక్యుపెన్సీ బాగుండటంతో వీలైనన్ని రోజులు థియేటర్లోనే బొమ్మ ఆడించాలని చూస్తున్నారు.

సక్సెస్ అయిన సినిమాల సంగతి అలా ఉంటుంది. మరి ప్లాప్ అయితే  గనుక సీన్ మరోలా ఉంటుంది అనడానికి `ఆచార్య` సినిమా ఉదహరించవచ్చు. ఇటీవలే `ఆచార్య` భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- స్టార్ మేకర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందు అంచానాలు ఆకాశాన్ని అంటాయి.

ఇద్దరు హీరోల నడుమ తొలి రోజు వసూళ్లు తప్ప మరుసటి రోజు నుంచి వసూళ్లు అమాంతం పడిపోయాయి. థియేటర్లన్నీ ఖాళీ అయిపోయాయి. ఫుల్ రన్ లో సినిమా ఎంత సాధించిందన్నది క్లారిటీ లేదు గానీ..నిర్మాతలు...డిస్ర్టిబ్యూటర్లకి భారీ ఎత్తున నష్టాలైతే వచ్చాయని తెలుస్తోంది. ఏప్రిల్ 29న రిలీజ్ అయిన సినిమా సరిగ్గా 20 రోజులకే ఓటీటీలో రిలీజ్ కి వచ్చేస్తుంది.

మే 20న చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. ప్రైమ్ అధికారికంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది. సాధారణంగా ఓటీటీ నిబంధనల ప్రలకారం అయితే ఆరు వారాలు తర్వాత ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ థియేటర్ వద్ద  ఫలితాలు తారుమారు అవ్వడంతో ముందొస్తుగానే  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

దీన్ని బట్టి `ఆచార్య` బాక్సాఫీస్ వైఫల్యాన్ని అంచనా వేయోచ్చు.  బాక్సాఫీస్ వసూళ్లు ఒక్కసారిగా పడిపోవడంతోనే వీలైనంత త్వరగా ప్రైమ్ లోకి తీసుకొచ్చి కొంతైనా నష్టాల్ని భర్తీ చేయోచ్చని భావిస్తున్నారేమో.