ఆచార్య దర్శకుడికి మెగాస్టార్ పిలుపు.. ఎందుకంటే??

Wed Jun 09 2021 14:00:09 GMT+0530 (IST)

Acharya Movie Shooting Updates

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 152వ సినిమా ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా పై మెగా అభిమానులలో రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. మెగాఫాదర్ సన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీని మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిరంజన్ రెడ్డి రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఆచార్య టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుండే సినిమా పై హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.ఈ సినిమా షూటింగ్ కేవలం 15రోజులు మాత్రమే బాలన్స్ ఉన్నట్లు టాక్. అయితే ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసినట్లుగా ఈ మూవీ నుండి అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇదివరకు రిలీజ్ చేసినటువంటి ఆచార్య టీజర్ తో పాటు లాహేలాహే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా ఓ కీలకపాత్ర పోషిస్తుండగా.. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే రాంచరణ్ జోడిగా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో రాంచరణ్ సిద్ధ అనే పేరుతో విద్యార్ధి సంఘానికి నాయకుడుగా నక్సలైట్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక మెగాస్టార్ జోడిగా రెండోసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

అయితే సినిమా రిలీజ్ సమయానికి కరోనా అడ్డుకట్టవేసింది. ఈ మెగా మల్టీస్టారర్ మూవీ మే నెలలోనే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా పరిణామాలు పరిస్థితులను తారుమారు చేసాయి. దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో సినిమా మళ్లీ వాయిదా పడింది. అయితే తాజాగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపులు లభించడంతో సినిమా షూటింగ్స్ ప్రారంభించే పనిలో ఉన్నారు యాక్టర్స్ మేకర్స్. తాజాగా ఆచార్యకు సంబంధించి మెగాస్టార్ కూడా వర్క్ స్పీడప్ చేయాలనీ.. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసేవిధంగా షెడ్యూల్ రెడీ చేయమని డైరెక్టర్ కు పిలుపునిచ్చినట్లు టాక్. మరి అసలే సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరగా ఫినిష్ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేసాడట మెగాస్టార్. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.