Begin typing your search above and press return to search.

సిద్ధ ప్రేయసి నీలాంబరి కి 'ఆచార్య' బర్త్ డే విషెస్..!

By:  Tupaki Desk   |   13 Oct 2021 10:35 AM GMT
సిద్ధ ప్రేయసి నీలాంబరి కి ఆచార్య బర్త్ డే విషెస్..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సతాజా చిత్రం ''ఆచార్య''. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్.. చెర్రీ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పూజా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేశారు.

'ఆచార్య' చిత్రం నుంచి తాజాగా విడుదలైన పోస్టర్ లో లంగావోణీలో ఉన్న పూజా.. చేతిలో పూజా సామగ్రి పట్టుకొని అందంగా నవ్వుతూ నిలబడి ఉంది. ఇందులో నక్సలైట్ సిద్ధ ప్రేయసి నీలాంబరిగా పూజా హెగ్డే కనిపించనుంది. ఆమె పేరు మీద ఓ పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో పుజా పాత్ర చనిపోతుందని టాక్ ఉంది.

'రంగస్థలం' సినిమాలో రామ్ చరణ్ సరసన 'జిగేల్ రాణి' లా ఆడిపాడిన పూజా హెగ్డే.. ఇప్పుడు 'ఆచార్య' లో మరోసారి మెగా వారసుడితో జత కడుతోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న పూజా.. నీలాంబరి పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో నిడివి తక్కువైనా అంగీకరించిందని తెలుస్తోంది. మరి బుట్టబొమ్మకు ఆ పాత్ర ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

కాగా, 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇది కొరటాల తరహా సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చిరు - చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ఫస్ట్ సింగిల్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆచార్య' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2022 ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానుంది.