'ఫైటర్' మ్యూజిక్ .. ఆయన ఫింగరింగ్ దేనికి?

Mon Jul 13 2020 09:30:44 GMT+0530 (IST)

Ace Music Director Mani Sharma Roped in For Fighter

మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో క్లారిటీ మిస్సయితే ఆ పర్యవసానం ఫైనల్ ఔట్ పుట్ క్వాలిటీపై పడుతుంది. రీరికార్డింగ్ సహా పాటల్లో క్రియేటివ్ స్టఫ్ మిస్సయ్యే ఛాన్సుంటుంది. పైగా ప్రాజెక్ట్ ఆరంభం నుంచి స్క్రిప్టు మొత్తం విని తమతో పాటే ట్రావెల్ అయ్యే సంగీత దర్శకుడు మిడిల్ డ్రాప్ అయినా ఆ ప్రభావం అంతా ఇంతా కాదు. కథ ట్రావెలింగ్ తో పాటే ఫీల్ ని క్యారీ చేయడంలో మ్యూజిక్ డైరెక్టర్ ఫెయిలయ్యే ఛాన్సుంటుంది. ఆ అనుభవం ఇంతకుముందు సాహో నిర్మాతలకు అయ్యింది. సాహో చిత్రీకరణ అంతా పూర్తయిపోయిన క్రమంలో ఇందులో పాటల కోసం రీరికార్డింగ్ కోసం సంగీత దర్శకుల్ని పదే పదే మార్చాల్సి వచ్చింది. తొలి ఎంపిక చివరి వరకూ లేదు. దీంతో ఆ ప్రభావం అంతో ఇంతో పడింది. ఖర్చు కూడా ఒక రకంగా పెరిగిందనే ముచ్చటించుకున్నారు. ఒక పాన్ ఇండియా రేంజ్ మూవీకి ఇలా జరగాల్సింది కాదన్న ముచ్చటా ఇండస్ట్రీ ఇన్ సైడ్ సాగింది.అదంతా సరే కానీ.. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ `ఫైటర్`కి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొందని చెబుతున్నారు. ఆరంభం ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ఆడియెన్ ని దృష్టిలో ఉంచుకునే ప్రారంభించారు. మణిశర్మను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. ఆ తర్వాత పూరి- ఛార్మి ఆలోచన మారింది. ఫైటర్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజుకు తీసుకెళ్లాలని ఆలోచించి కరణ్ జోహార్ ని సంప్రదించడం అటుపై కాన్వాస్ అమాంతం పెంచేసిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ వైపు నుంచి అన్నివిధాలా పూరికి సహకారం అందింది. కరణ్ తో ఇంటరాక్ట్ కావడంలో విజయ్- పూరి పెద్ద సక్సెసయ్యారు. ఇక ముంబైలో కొంత షూటింగ్ పూర్తయ్యాకా.. అనూహ్యంగా మహమ్మారీ వీళ్ల ప్లాన్ ని దెబ్బ కొట్టింది. అయినా కానీ పట్టువదలని విక్రమార్కుల్లా ఫైటర్ కోసం సరికొత్త ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు.

ముంబైలో కొవిడ్ విలయం వల్ల అక్కడి నుంచి షెడ్యూల్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడే సెట్స్ వేసి పెండింగ్ షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు కరణ్ జోహార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ఇటీవల తెలిసింది. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఫైటర్ మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా మార్చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ ఈ ప్రాజెక్టులో అడుగు పెట్టాక చాలా మార్పు చేర్పులు చేస్తున్నారట. ముఖ్యంగా బాలీవుడ్ సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలని ఆయన పూరీ కి సూచించారట. అయితే పూరీకి ఎంతో సన్నిహితుడు అయిన ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను తొలగిస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆయనను తొలగించి వేరే సంగీత దర్శకుడిని ఎంపిక చేయడం అంటే ఆలోచించదగినదే. మణిశర్మను కాదని ఇంకెవరిని కరణ్ రికమండ్ చేస్తున్నారు? అన్నదానికి పూరీనే ఆన్సర్ ఇస్తారేమో చూడాలి. కరణ్ అనవసరంగా కాస్త ఎక్కువగానే ఫింగరింగ్ చేస్తున్నారా? అన్నది చూడాలి. సంగీత దర్శకుడి మార్పుపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.