Begin typing your search above and press return to search.

అవార్డులు రాకుంటే.. బచ్చన్ సర్ వింత థియరీ

By:  Tupaki Desk   |   26 Nov 2021 10:30 AM GMT
అవార్డులు రాకుంటే.. బచ్చన్ సర్ వింత థియరీ
X
జూనియర్‌ బచ్చన్‌ అభిషేక్ బచ్చన్‌ తాజాగా నటించిన బాబ్ బిశ్వాస్ సినిమా డిసెంబర్‌ 3న ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ కాబోతుంది. జీ5 వారు ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. 2014 లో వచ్చిన కహాని సినిమాలోని సాస్వత చటర్జీ పాత్రకు కొనసాగింపు పాత్రతో రూపొందిన ఈ సినిమా కోసం అభిషేక్‌ బచ్చన్‌ చాలా కష్టపడ్డట్లుగా టీజర్ మరియు మరియు పోస్టర్‌ లు చూస్తుంటే అర్థం అవుతోంది.

గత వారం పది రోజులుగా బాబ్ బిశ్వాస్ సినిమా ప్రమోషన్ లో బచ్చన్‌ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అభిషేక్ బచ్చన్‌ ఓ రేడియో ఇంటర్వ్యూకు వెళ్లాడు. అక్కడ హోస్ట్‌ పలు ప్రశ్నలు వేయగా బచ్చన్ సమాధానాలు చెబుతూ వచ్చాడు. ఆ సమయంలో అవార్డులపై మీ అభిప్రాయం ఏంటీ అంటూ ప్రశ్నించారు.

అందుకు జూనియర్ బచ్చన్ స్పందిస్తూ.. ప్రతి ఒక్క నటీ నటులకు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు దక్కించుకోవాలనే కోరిక ఉంటుంది. కొందరు నాకు అవార్డులపై నమ్మకం లేదని అంటూ ఉంటారు. అలా అన్నారు అంటే వారికి ఒక్క అవార్డు కూడా రాకపోవడమే.

ఒక్క అవార్డు కూడా రాని వారు మాత్రమే అవార్డులంటే ఆసక్తి లేదని అంటూ అవార్డులను విమర్శిస్తూ ఉంటారు. అవార్డులతో పాటు ప్రతి నటుడు కూడా ప్రేక్షకుల ప్రశంసలు కోరుకుంటూ ఉంటాడు. ఆ ప్రశంసలతో పాటు ప్రతి ఒక్కరికి కూడా అవార్డులు కూడా దక్కాలి. అప్పుడే నటుడిగా లేదా నటిగా మరింత మంచి పాత్రల్లో నటించే ఉత్సాహం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.

ఎవరికి అయితే అవార్డులు రాలేదో వారు అంత పాపులర్ కాదన్నమాట లేదా నీ నటన అంత బాగాలేని అర్థం. అవార్డులను లైట్ తీసుకున్న వారి గురించి బచ్చన్ చెప్పిన థియరీ వింతగా ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ బచ్చన్‌ కు కమర్షియల్‌ గా సక్సెస్ లు ఎక్కువ రాకున్నా కూడా నటుడిగా మంచి గుర్తింపు దక్కింది.

అలాగే పలు అవార్డులు కూడా అభిషేక్ బచ్చన్ కు వచ్చాయి. తండ్రి మరియు భార్య పాపులారిటీని దక్కించుకుని అభిషేక్ బచ్చన్‌ సినిమాలు చేస్తున్నాడు.. వారిద్దరి వల్లే జూనియర్‌ బచ్చన్‌ ఇండస్ట్రీలో ఉన్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.