అభిషేక్-ఐశ్వర్యా రాయ్ దంపతులకు స్టోరీ సెట్ అవ్వడం లేదా?

Sat Sep 24 2022 11:56:40 GMT+0530 (India Standard Time)

Abhishek Aishwarya Rai Couple Isnt Set Story

బాలీవుడ్ ఆదర్శ దంపతులు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యా రాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అటుపై తల్లిదండ్రులుగాను మారారు. ప్రస్తుతం ఐశ్యర్య రాయ్ గర్భం దాల్చింది. త్వరలో మరో బేబికి జన్మనివ్వబోతుంది. ఇక ఈ దంపతులు పెళ్లికి ముందు..పెళ్లి తర్వాత కొన్ని చిత్రాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.నటులుగా  మొదలైన ప్రయాణమే ప్రేమకు అక్కడ నుంచి పెళ్లి వరకూ దారి తీసింది. అయితే వివాహం చేసుకున్న తర్వాత ఈ జంట కలిసి సినిమాలు చేసింది లేదు చాలా తక్కువ. ఇద్దరు వేర్వేరుగా ఎవరికి వారు సినిమాలు చేస్తున్నారు తప్ప! కలిసి నటించడం అన్నది జరగడం లేదు. తాజగా  ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య సైతం  ఈ విషయం గురించి స్పందించింది.

'అవును. ఇది జరగాలి అన్నారు. తనకు మరియు అభిషేక్‌కు కలల ప్రాజెక్ట్ సాకారమవుతుందని  ఆశించింది. అలాగే అభిషేక్ కూడా భార్యా మణితో కలిసి నటించడానికి అంతే ఆసక్తి చూపిస్తున్నాడని ఆయన మాటల్ని బట్టి అర్ధమవుతుంది.'సరైన సమయంలో సరైన స్క్రిప్ట్‌గా ఉండాలి. అప్పుడే ఇద్దరం కలిసి నటిస్తాం.  అది కుదిరే వరకూ  మేము కలిసి సినిమా సినిమా చేయలేము. కానీ మేమిద్దరం కలిసి పనిచేయడానికి ఎంతో  ఇష్టపడతాము' అని అన్నారు.

మొత్తానికి భార్యాభర్తలిద్దరూ కలిసి నటించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కానీ సరైన కథ సెట్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఇద్దరు జంటగా వెండి తెరపై కనిపించి సంవత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ జంటను తెరపై చూడాలని అభిమానులు అంతే ఉత్సాహంగా ఉన్నారు. కానీ  ఆకాంబోని కలిపే కథే సిద్దంగా లేదు.

అయితే గతంతో పోల్చుకుంటే ఐశ్వర్యా రాయ్ సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. తల్లిగా మారడం సహా...రూప లావణ్యంలో వచ్చిన భారీ మార్పులతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకోలేకపోతుంది. ఆమె కూడా అంత సీరియస్ గా ట్రై చేయలేదు.

ప్రస్తుతం కోలీవుడ్ లో మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న  'పొన్నియన్ సెల్వన్' మొదటి భాగంలో నటిస్తోంది. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఐశ్వర్యా రాయ్ ఫోటోలు ముంబై  ఎయిర్ పోర్ట్ నుంచి లీకయ్యాయి.  ఐశ్వర్యా రాయ్ తెలుపు రంగు షర్ట్..బ్లాక్ ప్యాంట్ లో కనిపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.