Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు బిబి4 విన్నర్‌ సంతృప్తి చెందాడట

By:  Tupaki Desk   |   25 Jan 2021 5:15 AM GMT
ఎట్టకేలకు బిబి4 విన్నర్‌ సంతృప్తి చెందాడట
X
తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 4 విన్నర్‌ గా నిలిచిన అభిజిత్ తీరు హౌస్ లో అయినా బయట అయిన ఒకే తీరుగా ఉంది. హౌస్ లో ఉన్న సమయంలో ప్రతి విషయాన్ని ఆలోచించి అనేక లెక్కలు వేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకునేవాడు. అది గేమ్ అయినా మరేదైనా. అందుకే ఆయన బిగ్‌ బాస్ విన్నర్ గా నిలిచాడు అనేది అభిమానుల మాట. ఇక బిబి విన్నర్‌ అయిన తర్వాత కూడా అభిజిత్ చాలా సింపుల్ అండ్ స్వీట్ గానే కంటిన్యూ అవుతున్నాడు. సినిమా ఎంపిక విషయంలో ఇతర బిబి కంటెస్టెంట్స్ హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్నారు. కాని అభిజిత్ మాత్రం కథల మీద కథలు వింటూ వచ్చాడు. ఎట్టకేలకు ఒక కథ నచ్చిందని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.

అభిజిత్ కథ విషయంలో ఎట్టకేలకు సంతృప్తి చెందినట్లుగా చెప్పడంతో త్వరలోనే సినిమా పట్టాలెక్కబోతుందని అంటున్నారు. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతున్న అభిజిత్ ఆవేశపడి వచ్చిన కథలన్నింటికి ఓకే చెప్పడం లేదు. సినిమా ఎంపిక కోసం నెలల సమయం తీసుకున్నాడు. బిబి 4 క్రేజ్ ను ఉపయోగించుకుని మంచి కథతో సినిమా చేస్తే తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆలస్యం అయినా పర్వాలేదని విభిన్నమైన కాన్సెప్ట్ ను అభిజిత్ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కథ ఓకే అవ్వడంతో షూటింగ్ ప్రారంభం కూడా త్వరలో ఉండే అవకాశం ఉందంటున్నారు.