బావ గారితో స్టార్ హీరో డిఫరెన్సెస్ చికాకులు

Sun May 22 2022 09:26:05 GMT+0530 (IST)

Aayush Sharma walks out of Salman Khan Kabhi Eid Kabhi Diwali

బామ్మర్ధి బామ్మర్ధే.. సినిమా సినిమానే! ఆ రెండిటిని ముడిపెట్టి చూడడం కరెక్ట్ కాదనుకున్నాడో ఏమో సదరు స్టార్ హీరో ఏకంగా తన బావ గారినే మూవీ నుంచి బయటకు పంపేసాడు. ప్రస్తుతం ఇది బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బావ బావమరుదుల నడుమ క్రియేటివ్ డిఫరెన్సెస్ కి సంబంధించిన కథనాలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి. ఇంతకీ ఎవరా బావ.. ఎవరా మరిది? అంటే.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి తన సోదరి భర్త ఆయుష్ శర్మతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో అది కాస్తా హాట్ టాపిక్ గా మారింది.ఆయుష్ శర్మను తాజా ఇన్సిడెంట్ లో సల్మాన్ ఖాన్ `కభీ ఈద్ కభీ దీపావళి` నుండి బయటకు పంపారు. దానికి కారణమేమిటీ అంటే.. సల్మాన్ తో సృజనాత్మక విభేధాలేనని తెలుస్తోంది.  సల్మాన్ ఖాన్ నటించిన కభీ ఈద్ కబీ దీపావళి చిత్రం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. నటీనటుల ఎంపిక నుండి విడుదల వరకు సినిమా నిర్మాతలతో డిఫరెన్సెస్ వరకు హెడ్ లైన్స్ లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

ఇటీవలే సాజిద్ నదియాడ్ వాలా ఇకపై ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో లేనని చెప్పేసారని వార్తలొచ్చాయి. దీంతో సల్మాన్ ఖాన్ స్వయంగా బరిలో దిగి సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ తో ప్రధాన నిర్మాతగా కొనసాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయుష్ శర్మ- పూజా హెగ్డే- జహీర్ ఇక్బాల్ కూడా కనిపిస్తారని టాక్ వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదలయ్యే అంచనాతో చిత్రబృందం ఈ చిత్రానికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించింది. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆయుష్ శర్మ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఇప్పుడు గుసగుస వినిపిస్తోంది.

నిర్మాణ సంస్థ కు సన్నిహితంగా ఉన్న ఒక సోర్స్ వివరాల ప్రకారం.. `కభీ ఈద్ కభీ దీపావళి` బృందం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించింది. కానీ ఆయుష్ .. సల్మాన్ బ్యానర్ మధ్య కొన్ని సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సృజనాత్మక విభేదాల వల్ల ఆయుష్ ప్రాజెక్ట్ నుండి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అసలు ఏమి జరిగిందనే దాని గురించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

నిజానికి కలతలు అనూహ్యమైనవి. ఆయుష్ శర్మ తన సినిమా షూటింగ్ ని ఇప్పటికే ప్రారంభించాడు. ఒక రోజంతా విలువైన షూటింగ్ ని కూడా పూర్తి చేశాడు. అయినప్పటికీ అతనికి ప్రొడక్షన్ హౌస్ తో కొన్ని విభేధాలు తలెత్తాయి. చివరికి అతను ఈ చిత్రం నుండి వైదొలిగేందుకు ఈ వివాదం కారణమైంది. ఆయుష్ శర్మ కభీ ఈద్ కభీ దీపావళి నుండి వైదొలగడంతో ఈ ఏడాది డిసెంబర్ విడుదల ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మేకర్స్ ఆయుష్ పాత్ర కోసం కొత్త నటుడిని మళ్లీ ఎంపిక చేయవలసి ఉన్నందున ఎవరో ఒకరిని ఖరారు చేయడానికి పట్టే సమయం చాలా కీలకం. అలాంటప్పుడు డిసెంబర్ 30న సినిమా విడుదల ప్లాన్ ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరో బావ గారితో బోలెడన్ని చిక్కులొచ్చిపడ్డాయన్నమాట! అయితే కలతలు సల్మాన్ - ఆయుష్ మధ్యనా లేక క్రియేటివ్ టీమ్ తోనా? అన్నదానిపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంటుంది.