Begin typing your search above and press return to search.

ఏంటీ..ఈ ఫొటోలో ఉంది సమంత కాదా..?

By:  Tupaki Desk   |   7 Jun 2020 1:30 PM GMT
ఏంటీ..ఈ ఫొటోలో ఉంది సమంత కాదా..?
X
సౌత్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత దశాబ్దకాలంగా దక్షిణాది సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'ఏమాయ చేసావే' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత.. విభిన్న పాత్రలతో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన మొదటి హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సామ్.. పెళ్ళైన తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఒకవైపు వైవాహిక జీవితాన్ని ఇంకోవైపు సినీ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. సమంతకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సామ్ ఒక ఫోటో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా సోషల్ మీడియాలో సామ్ ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఆ ఫొటోలో ఉంది సమంత అనుకుంటే మనం పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఆమె సమంత కాదు. ఆత్మిక అనే తమిళ యాక్ట్రెస్.

అమ్మడు చూడటానికి అచ్చం సమంత లాగే ఉంటుంది. చెన్నై కి చెందిన ఆత్మిక మోడల్‌ గా కెరీర్ ప్రారంభించింది. కొన్ని యాడ్స్ లో నటించిన ఆత్మిక పలు టీవీ షోలు కూడా చేసింది. ఈ క్రమంలో 'మీసాయ మురుక్కు' అనే తమిళ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌ పై తొలిసారిగా మెరిసింది ఆత్మిక. ఆ తర్వాత 'మ్యాజిక్' 'మ్యాజిక్ 2' అనే షార్ట్ ఫిల్మ్స్‌ లో కూడా యాక్ట్ చేసింది. అయితే ఆత్మిక సమంత లా ఉండటంతో బాగా పాపులర్ అయింది. అమ్మడిని చూసిన చాలా మంది సామ్ అని పొరపాటు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ చెన్నై సుందరిని చూసిన పలువురు సమంత కి సిస్టర్ ఎవరైనా ఉన్నారా అని నెట్టింట్లో వెతకడం స్టార్ట్ చేసారు కూడా. సమంతని ఆరాధించే హృదయాలు కూడా అప్పుడప్పుడు ఆత్మిక ఫోటోలు చూసి సామ్ ఫోటోలు అనుకోని వైరల్ చేసేస్తుంటారు.

సమంత పోలికలతో ఉండే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో బాగానే ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో ఆత్మిక కి 1.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఇటు తన అభిమానుల్ని అటు సామ్ ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో తమిళ బ్యూటీని చూసిన నెటిజన్స్ అచ్చం సమంతలానే ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. సామ్ పోలికలతో క్రేజ్ తెచ్చుకున్న ఆత్మిక సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుందేమో చూడాలి.