నాగచైతన్య గురించి అమీర్ ఖాన్ నాతో చెప్పారు!-చిరు

Wed Sep 22 2021 05:00:01 GMT+0530 (IST)

Aamir Khan told me about Nagachaitanya

నాగచైతన్య మనస్తత్వం ప్రతిభ మంచితనం గురించి మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లవ్ స్టోరి వేదికపై ప్రశంసించిన తీరును అక్కినేని అభిమానులు సహా తెలుగు ప్రజలు అంత తేలిగ్గా మార్చిపోలేరు. చైతన్య గురించి తనకు కూడా అమీర్ ఖాన్ చెప్పారని ఇదే వేదికపై చిరు అన్నారు.చిరు మాట్లాడుతూ.. ``నా స్నేహితుడు నాగార్జున గారి అబ్బాయి లవ్ స్టోరీలో నటించాడు. ఇందాక అమీర్ ఖాన్ నాతో నాగ చైతన్య గురించి చెప్పారు. లాల్ సింగ్ చద్దాలో నటించాడు. చాలా కంఫర్ట్ గా అనిపించింది. మంచి నటుడు..అన్నారు. ఆ మాట వింటే నాకూ సంతోషమేసింది. నాగ చైతన్య మంచి వ్యక్తి. సక్సెస్ ఫెయిల్యూర్స్ కు చాలా మంది ఎగిరిపడుతుంటారు. కానీ చైతూ ఎప్పుడూ ఒకేలా సంమయనంతో ఉంటాడు. నాగార్జున లాంటి కూల్ ఫాదర్ కు చైతూ లాంటి కూల్ సన్ ఉన్నాడు. ఇండస్ట్రీతో నాగ చైతన్య జర్నీ కూడా నిర్మాణాత్మకంగా సాగుతోంది. తను సుదీర్ఘ కాలం ప్రయాణం చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. చైతూ మంచి కథలు ఎంచుకుంటాడు. సెలెక్టివ్ గా కొత్తగా సినిమాలు చేస్తుంటాడు`` అని చిరు ప్రశంసించారు.

నాగ చైతన్య.. నా మిత్రుడు అమీర్ ఖాన్ కలిసి నటించిన సినిమా `లాల్ సింగ్ చద్దా` చూడాలని వేచి చూస్తున్నాను. నేనే ముంబై వచ్చి సినిమా చూస్తానని అమీర్ తో చెప్పాను. ఆయన లేదు నేనే వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మీకోసం ప్రొజక్షన్ వేయిస్తా అన్నారు. సో నైస్ ఆఫ్ హిమ్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ ను కలిసినప్పుడు తనకు సినిమా మీదున్న ప్యాషన్ గురించి చెప్పాడు. ఫారెస్ట్ గంప్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలిపాడు. సినిమా మీద అమీర్ ఖాన్ కు ఉన్న ప్రేమ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. మేమంతా లాల్ సింగ్ చద్దా చూసేందుకు వేచి ఉన్నాం`` అన్నారు.