మాజీ భార్య కోసం అమీర్ ఖాన్ సహాయం!

Thu Aug 11 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Aamir Khan help for ex wife

సినిమా ప్రపంచంలో స్టార్ సెలబ్రిటీలు ఎంత త్వరగా కలిసిపోతూ ఉంటారో అంతే త్వరగా కొన్నిసార్లు విడిపోతూ ఉంటారు. మరి కొందరు పిల్లలు పెద్దవారైన తర్వాత కూడా విడిపోతూ ఉంటారు.ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావుకు విడాకులు ఇవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసిందే. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమీర్ ఖాన్ ఆమెతో దాదాపు 16 ఏళ్ల పాటు ఎంతో హ్యాపీగానే కొనసాగాడు.

ఒక విధంగా మొదటి భార్యతో కూడా ఇప్పటికే అమీర్ ఖాన్ చాలా హ్యాపీగానే కనిపిస్తూ ఉంటాడు. వారి పిల్లలకు సంబంధించిన బర్త్డే పార్టీలలో కూడా కలిసి పాల్గొంటాడు. ఇక కిరణ్ రావు నుంచి గత ఏడాది విడిపోయినా అమీర్ ఖాన్ ఇప్పటికీ కూడా ఆమెతో ఫ్రెండ్లీ గానే కొనసాగుతున్నాడు. వీరు కలిసి ఉన్నప్పుడే ఒక ప్రొడక్షన్ ను కిడా మొదలుపెట్టారు. ఇక ఇప్పటికి కూడా దాన్ని కలిసే కొనసాగిస్తూ ఉండడం విశేషం.

అయితే కిరణ్ రావు ఇటీవల దర్శకత్వం వహించిన మరొక సినిమాకు అమీర్ ఖాన్ సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం. లాపాటా లేడీస్ అనే ఆ సినిమా  మార్చి 3న విడుదలవుతుందని ప్రకటించారు. విడాకుల తర్వాత  తమ మాజీలతో అనుబంధాన్ని కొనసాగించడం మనం తరచుగా చూడలేము. కానీ అమీర్ కిరణ్ మాత్రం ఊహించని విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

బహుశా వారు వ్యక్తిగతంగా మాత్రమే విడాకులు తీసుకున్నారు వృత్తిపరంగా కాదు అని అనిపిస్తోంది. మరోవైపు కిరణ్ రావు లాల్ సింగ్ చడ్డా సినిమాలో కూడా ఒక టెక్నీషియన్ గా వర్క్ చేశారు.

ఆ సినిమా ప్రొడక్షన్లో కూడా కిరణ్ రావు ఒక పార్ట్నర్ గా ఉన్నారు. ఇక త్వరలోనే మరికొన్ని సినిమాలను కూడా వీరు కలిసి నిర్మించాలని అనుకుంటున్నారు. ఇక లాల్ సింగ్ చద్దా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ గురువారం రోజు విడుదలవుతున్న విషయం తెలిసిందే.