Begin typing your search above and press return to search.

సైరా ట్రైలర్: అమీర్.. సల్మాన్ అల్ ది బెస్ట్

By:  Tupaki Desk   |   20 Sep 2019 6:40 AM GMT
సైరా ట్రైలర్: అమీర్.. సల్మాన్ అల్ ది బెస్ట్
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా' ట్రైలర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ పై ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ తమ స్పందన తెలిపి 'సైరా' టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్పారు. తాజా బాలీవుడ్ Mr. పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా 'సైరా' ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు. "ట్రైలర్ ఇప్పుడే చూశాను. భారీ స్థాయిలో ఉంది. నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని.. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వేచి చూస్తున్నా. చిరంజీవి సర్ కు.. రామ్ చరణ్.. సైరా టీమ్ అందరికీ అల్ ది బెస్ట్" అంటూ ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించారు.

మరో వైపు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'సైరా' ట్రైలర్ షేర్ చేసి "చిరంజీవి గారు.. చరణ్ లకు నా అభినందనలు. ఆల్ ది బెస్ట్" అంటూ ట్వీట్ చేశారు. ఇక మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా ట్రైలర్ పై స్పందించారు. "సాటిలేని విజువల్స్.. ప్రతి ఫ్రేమ్ లో సినిమాలో భారీతనం కనిపించింది. చిరంజీవి గారు సూపర్. అమితాబ్ బచ్చన్ సర్.. రామ్ చరణ్.. సురేందర్ రెడ్డి.. రత్నవేలు & టీమ్ అందరూ గ్రేట్ వర్క్ చేశారు. సైరా నరసింహా రెడ్డి కోసం ఎదురు చూస్తున్నా" అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'సైరా' ట్రైలర్ ను షేర్ చేసి 'మెగాస్టార్' అంటూ ఒక లవ్ ఎమోజిని పెట్టడం అందరినీ ఆకర్షించింది. మెగా ఫ్యామిలీ హీరోలు కూడా 'సైరా' ట్రైలర్ ను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసి 'సైరా' టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.