Begin typing your search above and press return to search.

రోమ్ లో సీక్రెట్ సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   21 July 2017 9:21 AM GMT
రోమ్ లో సీక్రెట్ సూపర్ స్టార్
X
హింది సినిమా మార్కెట్ ను తన సినిమాలుతో ప్రపంచ మార్కెట్ పై సత్తా చాటిన అమీర్ ఖాన్ ఇప్పుడు మరో వైవిధ్య సినిమా థూగ్స్ ఒఫ్ హిందూస్తాన్ సినిమా షూటింగ్ చివరి దశ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. దంగల్ సినిమా ఘన విజయం తరువాత వెంటనే తన గెటప్ అంతా మార్చి మరింత కొత్తదనం కోసం పాత్ర కోసం హెయిర్ స్టైల్ మార్చి ముక్కుకు రింగ్ కూడ పెట్టించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలా వరుసుగా సినిమా షూటింగ్ లుతో బిజీ గా ఉన్న అమీర్ ఖాన్ ఇప్పుడు తన ఫ్యామిలి తో సరదాగా రోమ్ వీదులలో విహరిస్తున్నాడు.

అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు కొడుకు ఆజాద్ రావు ఖాన్ తో కొద్ది వారాలు షూటింగ్లుకు సెలవు పెట్టి టూర్ లో ఉన్నాడు. తన కొడుకుకి వేసవి సెలవులు ఇంకా కొన్ని మిగిలి ఉండటంతో పైగా థూగ్స్ ఒఫ్ హిందూస్తాన్ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు రావడంతో ఇలా తన ఫ్యామిలి తో ఇటలీలో కొంత సమయం సేద తీరుతున్నాడు. అమీర్ ఖాన్ ఇప్పుడు తన రోబోతున్న సినిమా థూగ్స్ ఒఫ్ హిందూస్తాన్ ప్రమోషన్ పనులు మొదలుపెట్టనున్నాడు. దానితో పాటుగా అమీర్ ఖాన్ తదుపరి సినిమా సీక్రెట్ సూపర్ స్టార్ షూటింగ్ కూడ మొదలుకానుంది.

అమీర్ ఇప్పుడు తన భార్య కొడుకుతో ఇటలీ వెళ్ళి అక్కడ ఉన్న టెనుట కాసనోవా వినేరి మరియు సెయింట్ ఆగ్నేస్ ఫార్మ్ కూడ వీక్షించారు. టస్కనీలో ఉన్న కొన్ని ప్రసిద్ది కట్టడాలును కూడ సందర్శించారట. ఫ్లోరెన్స్ లో ఉన్న మ్యూజియం కు వెళ్ళి అక్కడే ఉన్న ఎకడమియా గ్యాలరీని కూడా చూడబోతున్నారు. పీసా లో ఉన్న లీనింగ్ టవర్సా కూడా వీక్షిస్తారట. అమీర్ ఖాన్ తన ఫ్యామిలి తో ఉన్న ఫోటోలు అతని ఫ్యాన్ క్లబ్ లో ఇప్పుడు భలే సందడి చేస్తున్నాయి.