గోపీచంద్ మలినేని రిలీజ్ చేసిన 'ఆకాశ వీధుల్లో' టీజర్..!

Fri Jul 23 2021 16:00:01 GMT+0530 (IST)

'AakasaVeedhullo ' teaser released by Gopichand Malineni ..!

గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ''ఆకాశ వీధుల్లో''. 'రంగస్థలం' 'కల్కి' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వైజాగ్ భామ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు ఇతర రొమాంటిక్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే సిద్ శ్రీరామ్ పాడిన 'అయ్యయ్యయ్యో' సాంగ్ కూడా అలరించింది. ఈ క్రమంలో క్రాకింగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు.సిద్ధు ఎవరి మాట వినని రాక్ స్టార్ అంటూ హీరో పాత్రని పరిచయం చేయడంతో 'ఆకాశ వీధుల్లో' టీజర్ ప్రారంభమైంది. అతనికి ఆల్కహాల్ - డ్రగ్స్ - అమ్మాయిలు - గొడవలు.. ఇలా చాలా అలవాట్లు ఉన్నప్పటికీ అతను మోస్ట్ సెలెబ్రెటెడ్ రాక్ స్టార్ అని చెబుతున్నారు. అయితే రాక్ స్టార్ లా బిహేవ్ చేయడం లేదని.. మాన్స్టర్ గా ప్రవర్తిస్తుంటాడని టీజర్ లో చూపించే ప్రయత్నం చేశారు. గౌతమ్ కృష్ణ లుక్స్ పరంగా బాగా కనిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్.. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగున్నాయి.

మొత్తం మీద ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఈ ఇంటెన్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొటీన్ కు భిన్నమైన ప్రేమకథతో ''ఆకాశ వీధుల్లో'' చిత్రం తెరకెక్కుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. మనోజ్ జే.డీ - డీ.జె. మణికంఠ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.