Begin typing your search above and press return to search.

ఏంటి.. ప్లాప్ హీరో పాన్ ఇండియా మూవీనా..?

By:  Tupaki Desk   |   11 July 2020 4:15 AM GMT
ఏంటి.. ప్లాప్ హీరో పాన్ ఇండియా మూవీనా..?
X
ఈ మధ్య తెలుగు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల పై మోజు పడుతున్నారు. ఎప్పుడైతే ప్రభాస్ హీరోగా ‘బాహుబ‌లి’ సినిమా పాన్ ఇండియా వైడ్ గేట్లు తెరిచిందో.. అప్పటి నుండి తెలుగు స్టార్ అండ్ యంగ్ హీరోలలో పాన్ ఇండియా సినిమా తీయాలని ఆలోచన మొదలైంది. ప్రభాస్ తర్వాత మెల్లగా ఒక్కో హీరో పాన్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ కాంబో స్టార్స్ పాన్ ఇండియా స్టార్స్ కాబోతున్నారు. అలాగే మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి.. అల్లు అర్జున్ పుష్ప.. ఇలా ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఈ కోవలోకి త్వరలో యంగ్ హీరో ఆది సాయికుమార్ చేరనున్నాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ హీరోగా పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అది ఒక సినిమాగా కాదు ఓ సిరీస్ లాగా విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారట.

కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకున్న ఆది. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన ప్రతీ సినిమాలో వైవిద్యత కనబరుస్తున్నా.. ఎందుకో మరి హీరో సినిమాలు ఆకట్టుకోలేక పోతున్నాయి. మొదటి నుండి కూడా డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఆది. అయితే ఈ పాన్ ఇండియా సినిమా త‌న‌కు పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నాడట. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌.. వీఎఫ్‌ఎక్స్‌ల‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ‌ఎస్విఆర్ ప్రొడ‌క్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్‌ పై ఎస్విఆర్ నిర్మిస్తుండగా.. బాలవీర్.య‌‌స్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆది చేతిలో జంగిల్.. శశి సినిమాలు ఉన్నాయట. ఇక ఈ సినిమా చాప్టర్ 1 షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని అంటున్నారు.