ఆ ఎపిసోడ్ ని ఎక్కడికో లేపేసిన ఆద్య

Fri May 07 2021 16:22:38 GMT+0530 (IST)

Aadhya put that episode somewhere

మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒక కొత్త ముఖం తెరకు పరిచయమైతే ఆ ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో వేరే లెవల్లో ఉంటుంది. అందునా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసులే బరిలో దిగితే ఎలా ఉంటుందో వూహించవచ్చు. ఇక జీతెలుగులో డ్రామా జూనియర్స్ లేటెస్ట్ షోకు రేణు దేశాయ్ ఒక జడ్జిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఇప్పటికే నాలుగు సీజన్లు విజయవంతంగా సాగింది. ఇప్పుడు ఐదో సీజన్ కి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి - గాయని సునీత- రేణు దేశాయ్ జడ్జిలుగా కొనసాగుతున్నారు.ఈసారి ఎపిసోడ్ కి ప్రదీప్ మాచిరాజు స్థానంలో యాంకర్ రవి హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఐదో సీజన్ `డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్` హంగామా ఒక రేంజులోనే ఉండనుందని రేణు వారసురాలు ఆద్య ఎంట్రీతో అర్థమైంది. తల్లి కూతుళ్ల ఎపిసోడ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయమని ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమో తెలిపింది.

డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్.. మదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అందువల్ల ఇది వెరీ స్పెషల్. ఈసారి ఎపిసోడ్ లో పవన్-రేణు జంట కుమార్తె ఆద్య ఎంట్రీ హైలైట్ కానుంది. తాజా ప్రోమోలో ఆద్య ఎంట్రీకి వకీల్ సాబ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వస్తుంటే అభిమానులు ఎమోషనల్ గా కనెక్టయిపోయారు.

ఆద్య ఎంట్రీ వేళ రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. వేదికపైకి వస్తూనే ``ఎప్పటికీ నువ్వు నా బెస్ట్ గిఫ్ట్.. తను నన్ను అమ్మలా చూసుకుంది`` అంటూ కూతురికి ముద్దు పెట్టారు. ఆ వెంటనే ఆద్య కూడా ``మై మమ్మీ ఈజ్ బెస్ట్ మామ్ ఎవర్`` అంటూ వ్యాఖ్యానిస్తూ తన తల్లిని హగ్ చేసుకున్నారు.

ఇప్పుడు ఆద్య మన కోసం ఓ పాట పాడుతుంది అంటూ సింగర్ సునీత ఆహ్వానించగా.. ఆద్య ఓ హిందీ పాటను ఆలపించింది. తర్వాత సునీతతో కలిసి గొంతు కలపడం ఆసక్తిని కలిగించింది.

ఓ డైలాగ్ చెప్పమని ఎస్వీకే కోరగానే..``నాకు నచ్చేవి రెండే రెండు. ఒకటి మంచి నిద్ర.. రెండు మా అమ్మ`` అని ఆద్య ఎమోషనల్ డైలాగ్ చెప్పింది. నా గురించి నేనే ఇంట్రడక్షన్ ఇస్తా. నా పేరు రవి. నేను ఇక్కడ హోస్టును.. అని రవి పరిచయం చేసుకోగానే.. ``మీ అమ్మను రవి అక్క అని పిలుస్తాడు కాబట్టి నువ్వు రవి మామ అని పిలువు`` అని సునీత అంటారు. కానీ ఆద్య విసిరిన పంచ్ రవికి ఓ రేంజులోనే తాకింది. ``మీరు మామయ్య కాదు.. తాతయ్య`` అంటూ అదిరిపోయే పంచ్ వేసింది ఆద్య. మొత్తానికి పవన్ వారసురాలి బుల్లితెర ఎంట్రీ ఐక్యాచర్ గా నిలిచింది. ఆద్య ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.