Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాలో రామ్ చరణ్ అన్న...?

By:  Tupaki Desk   |   3 July 2020 2:56 AM GMT
బన్నీ సినిమాలో రామ్ చరణ్ అన్న...?
X
స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న సినిమా 'పుష్ప'. బన్నీ - సుక్కు కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో 'పుష్ప' పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో కథాంశం ఉండబోతున్న ఈ సినిమా లో బన్నీ ఊర మాసు మొరటు కుర్రాడిగా చిత్తూరు యాస లో మాట్లాడబోతున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రలో నటించబోతున్నారు అనే విషయంపై ఫిలిం నగర్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'పుష్ప' మూవీలో కథానుగుణంగా అల్లు అర్జున్ కు ఇద్దరు సోదరులుంటారట. వారిలో ఒకరు గ్రామ సర్పంచ్‌ గా కనిపిస్తారని టాక్‌ వినిపిస్తోంది. ఈ పాత్రలో హీరో ఆది పినిశెట్టి కనిపించనున్నారట. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన 'రంగస్థలం' సినిమా లో రామ్ చరణ్ అన్నగా నటించిన ఆది ఇప్పుడు బన్నీకి బ్రదర్ గా నటించబోతున్నాడట. ఇక రష్మిక మందన్నా పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న 'పుష్ప' సినిమాని తెలుగు తో పాటు త‌మిళ‌ మ‌ల‌యాళ‌ క‌న్న‌డ‌ హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.