Begin typing your search above and press return to search.

క్లాసిక్ డేస్ ని త‌ల‌పిస్తున్న శ‌ర్వా లొకేష‌న్

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:06 AM GMT
క్లాసిక్ డేస్ ని త‌ల‌పిస్తున్న శ‌ర్వా లొకేష‌న్
X
క్లాసిక్ డేస్ మెమ‌రీస్ ని నాటిత‌రం తార‌లు అస్స‌లు మ‌ర్చిపోలేరు. ఒక‌ప్పుడు మాన‌వ సంబంధాలు ఎంతో గొప్ప‌గా ఉండేవి. ఇప్ప‌టిలా ఉరుకుల ప‌రుగుల జీవితం అప్పుడు ఉండేది కాదు. ముఖ్యంగా తార‌లంతా ఆన్ లొకేష‌న్ భోజ‌న స‌మ‌యంలో ఓచోట పంక్తి భోజ‌నం చేసేందుకు ఇష్ట‌ప‌డేవారు. ఒక‌రి న‌డుమ ఇంకొక‌రికి ఆప్యాయ‌తానురాగాలు క‌నిపించేవి. ఒక‌రికొక‌రు వ‌డ్డించుకుని ప్రేమ‌ను క‌న‌బ‌రిచేవారు. ఈ విష‌యాల్ని నాటిత‌రం న‌టీమణులు ఇప్ప‌టికీ నెమ‌రు వేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడ‌లా కాదు .. అంతా హ‌డావుడి జీవితం అని కూడా కామెంట్ చేస్తుంటారు.

చాలా కాలానికి శ‌ర్వానంద్ త‌న సినిమా సెట్లో ఆ సంగ‌తిని గుర్తు చేశాడు. ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఇలా అంతా పంక్తి భోజ‌నానికి రెడీ అయ్యారు. ఇందులో ఆడాళ్ల‌కు జోహార్లు అనిపించేలా అక్క‌డ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. శ‌ర్వా ఇలా స్వ‌యంగా ఆడాళ్లంద‌రికీ త‌న క్యారేజీని ఓపెన్ చేసి వ‌డ్డించ‌డం ఆప్యాయ‌త‌ను క‌న‌బ‌రచ‌డం ఇంట్రెస్టింగ్. ఇక శర్వానంద్ తినిపించే రుచిక‌ర‌మైన ఫుడ్ కోసం సీనియర్ నటీమణులు కారవాన్లను విడిచి వ‌చ్చేశార‌ట‌.

సీనియర్ నటీమణులు రాధికా శరత్ కుమార్.. ఖుష్బూ .. ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రం కోసం చిత్ర బృందం షూటింగ్ చేస్తుండ‌గా ఇలాంటి అరుదైన దృశ్యం క‌నిపించింది. రాధికా శరత్ కుమార్ సినిమా సెట్స్ నుండి ఆ అద్భుత‌ క్షణాన్ని పంచుకున్నారు. శర్వానంద్ తన ఇంటి నుండి తీసుకువచ్చే ఆహారాన్ని ఆస్వాధించడం త‌మ‌కు చాలా ఇష్ట‌మ‌ని అన్నారు. ముగ్గురు సీనియర్ నటీమణులు మంచి భోజ‌నాన్ని ఆస్వాధించారిలా. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ``హీరో శ‌ర్వా ఆహారాన్ని తీసుకువచ్చినప్పుడు షూటింగ్ లు సరదాగా ఉంటాయి. మనమందరం చుట్టూ కూర్చుని భోజ‌నం ఆస్వాదించడానికి కారవాన్ లను వదిలివేస్తున్నాం`` అని రాధిక వ్యాఖ్య‌ను జోడించారు.

శర్వానంద్ న‌టిస్తున్న ఆడాళ్లు మీకు జోమార్లు చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. సీనియ‌ర్ తార‌లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.