Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రిలీజ్ అప్డేట్!

By:  Tupaki Desk   |   9 Aug 2022 9:30 AM GMT
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రిలీజ్ అప్డేట్!
X
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో టాలెంటెడ్ నటుడు సుధీర్ బాబు మరొక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన సమ్మోహనం సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఆ తర్వాత V అనే సినిమాతో నానితో కలిసి మరొక ప్రయోగం కూడా చేశారు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఎలాగైనా థియేటర్లో మంచి సక్సెస్ అందుకోవాలి అని ఒక ఫిలిం బ్యాక్ డ్రాప్ లో సున్నితమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే టైటిల్ తోనే ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించిన ఈ దర్శకుడు ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు సినిమా విడుదల తేదీపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇక ప్రత్యేకంగా ఒక ప్రోమో కూడా విడుదల చేయడం జరిగింది.

ఒక బ్యూటిఫుల్ ప్రిన్సెస్ చుట్టూ తిరిగే కథతో సినిమా తీద్దామని అనుకుంటున్నాను అని హీరో చెప్పడంతో హీరోయిన్ కూడా అదే తరహాలో దర్శనమివ్వడం ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక సుధీర్ బాబు కూడా ఈ సినిమాల్లో కాస్త కొత్తగా కనిపిస్తున్నాడు. అతను ఈ సినిమాలో ఒక యువ డైరెక్టర్గా కనిపించబోతున్నాడు.

ఇక హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టి వెండి తెరపై తన అందంతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు చేసిన పాత్రల కంటే ఆమె ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుందట. ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

బుధవారం ఉదయం 11 గంటలకు సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనే విషయంలో అఫీషియల్ డేట్ ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ప్రస్తుత ఆడియన్స్ దృష్టిని ఈ సినిమా ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.