Begin typing your search above and press return to search.

క‌ప్పు టీ కంటే త‌క్కువగా థియేట‌ర్లో ధ‌ర డిసైడ్ చేసిన ఏపీ స‌ర్కార్

By:  Tupaki Desk   |   1 Dec 2021 11:30 PM GMT
క‌ప్పు టీ కంటే త‌క్కువగా థియేట‌ర్లో ధ‌ర డిసైడ్ చేసిన ఏపీ స‌ర్కార్
X
క‌ప్పు టీ ఇప్పుడెంత‌? ఎలాంటి టీ బంకులో అయినా రూ.10 త‌గ్గ‌టం లేదు. ఆ మాట‌కు వ‌స్తే రూ.10 కంటే ఎక్కువ ధ‌రే వ‌సూలు చేస్తున్నారు. అలాంట‌ది.. ఏపీ ప్ర‌భుత్వం మాత్రం రెండున్న‌ర గంట‌ల వెండితెర వినోదాన్ని మాత్రం కేవలం రూ.5ల‌కే అందించేందుక డిసైడ్ అయ్యింది. గ‌డిచిన కొద్దికాలంగా సినిమా టికెట్ల ధ‌ర‌పై ఏపీ ప్ర‌భుత్వం ప‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా.. దీనికి సంబంధించి తీసుకున్న కీల‌క నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. తాజాగా డిసైడ్ చేసిన ధ‌ర‌ల్ని చూస్తే.. న‌గ‌ర‌.. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్రీమియం టికెట్లు కొనే వారికి త‌డిచి మోపెడు అవుతుంటే.. చిన్న గ్రామాల్లోని ధియేట‌ర్ల‌లో సినిమా మాత్రం క‌ప్పు టీ కంటే త‌క్కువ ధ‌ర‌కే దొరికేలా తీసుకున్న నిర్ణ‌యం సినిమా రంగానికి చెందిన వారికి దిమ్మ తిరిగే షాకిచ్చేలా మారుతుంద‌న‌టంలో సందేహం లేదు.

ఏపీ స‌ర్కారు ఆన్ లైన్ లో సినిమా టికెటింగ్ విధానాన్ని తీసుకురావ‌టం తెలిసిందే. అయితే.. టికెట్ ధ‌ర‌ల‌పై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.ఈ ధ‌ర‌ల‌పై చిత్ర‌ప‌రిశ్ర‌మ ఉత్కంట‌గా ఎదురుచూస్తుంది. తాజాగా ఆ టెన్ష‌న్ కు తెర దించిన ప్ర‌భుత్వం రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్ల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. కార్పొరేష‌న్లు.. మున్సిపాలిటీలు.. న‌గ‌ర పంచాయితీలు.. గ్రామ పంచాయితీలు ఇలా విభ‌జ‌న చేసి.. ఎలాంటి థియేట‌ర్ల‌కు ఏ క్లాస్ కు ఎంత టికెట్ వ‌సూలు చేయాల‌న్న దానిపై స్ప‌ష్ట‌త ఇచ్చింది.

తాజాగా విడుద‌ల చేసిన ఆదేశాల్ని చూసిన‌ప్పుడు.. సినీ రంగంతో పాటు.. థియేట‌ర్ల య‌జ‌మానులు షాక్ తినేలా ధ‌ర‌లు ఉన్నాయి. కొంత‌లో కొంత‌.. కార్పొరేష‌న్ల ప‌రిధిలోని మల్టీఫ్లెక్సుల్లో ప్ర‌ద‌ర్శించే సినిమా టికెట్ల ధ‌ర‌ల‌కు ఫ‌ర్వాలేద‌నే స్థాయిలో ఉంటే.. చిన్న గ్రామాల్లోని థియ‌ట‌ర్ల వారికి క‌రెంటు ఖ‌ర్చులు కూడా వ‌స్తాయా? అన్న సందేహాన్ని క‌లిగించేలా ధ‌ర‌లు ఉన్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కార్పొరేష‌న్ల‌లోని మ‌ల్టీ ఫ్లెక్సుల్లో డిసైడ్ చేసిన టికెట్ ధ‌ర గ‌రిష్ఠంగా రూ.250 ఉంటే.. గ్రామ పంచాయితీల్లోని థియేట‌ర్ల‌లో క‌నిష్ఠ టికెట్ ధ‌ర రూ.5 ఉండటం విశేషం. ప్రాంతాల వారీగా.. థియేట‌ర్ల వారీగా.. క్లాసుల వారీగా టికెట్ ధ‌ర‌లు ఏ రీతిలో ఉన్నాయ‌న్న‌ది చూస్తే..

ఏపీ సర్కారు ఇటీవల ఆన్ లైన్ సినిమా టికెటింగ్ విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సినిమా టికెట్ల కొత్త రేట్లను నేడు ప్రకటించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ప్రాంతాల్లోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లకు వివిధ రకాల రేట్లను నిర్దేశించింది. సవరించిన ధరల ప్రకారం... అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా, అత్యంత గరిష్ట ధర రూ.250గా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.

న‌గ‌ర కార్పొరేష‌న్లలో..

మల్టీప్లెక్సు
ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ-ఎయిర్ కూల్
ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ
ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20
మున్సిపాలిటీల్లో..
మల్టీప్లెక్స్
ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ-ఎయిర్ కూల్
ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ
ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15
నగర పంచాయతీల్లో..
మల్టీప్లెక్స్
ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ-ఎయిర్ కూల్
ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ
ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
గ్రామ పంచాయతీల్లో..
మల్టీప్లెక్స్
ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ- ఎయిర్ కూల్
ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ
ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5