Begin typing your search above and press return to search.

సిస‌లైన యోధుల‌కు వైసీపీ ప్ర‌భుత్వ స్ఫూర్తి నింపే కానుక‌

By:  Tupaki Desk   |   5 Jun 2020 4:00 AM GMT
సిస‌లైన యోధుల‌కు వైసీపీ ప్ర‌భుత్వ స్ఫూర్తి నింపే కానుక‌
X
ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌హ‌మ్మారీ విల‌యంపై ఎన్నో పాట‌లు వ‌చ్చాయి. ఎంద‌రో క‌వులు స్పందించి క‌విత‌లు రాశారు. గేయాల్ని.. పాట‌ల్ని రాసారు. వాటికి టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు ట్యూన్ క‌ట్టి ఆల‌పించారు. ప‌లువురు తార‌లు వీటిలో న‌టించారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ ఇదే పంథా. అన్ని ప‌రిశ్ర‌మ‌ల స్టార్లు క‌లిసిక‌ట్టుగా మ‌హ‌మ్మారీపై యుద్ధానికి సిద్ధ‌మ‌య్యారు. ఇదంతా సామాన్య ప్ర‌జ‌ల్లో వైర‌స్ మ‌హ‌మ్మారీపైనా అనూహ్య విప‌త్తుపైనా పూర్తి అవ‌గాహ‌న పెంచేందుకు సాయ‌మైంది.

క‌ష్ట‌కాలంలో సైన్యంలా మారి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందిస్తున్న డాక్టర్లు- నర్సులు- పోలీసులు- పారిశుధ్య కార్మికులు.. అంద‌రికీ ఆర్మీనే దిగొచ్చి ఆకాశం నుంచి పూల‌వ‌ర్షం కురిపించ‌డం .. జెండా వంద‌నం చేయ‌డం చ‌రిత్ర‌లో తొలిసారి. త‌మ ప్రాణాల్ని సైతం లెక్క చేయ‌క తెలంగాణ‌ ప్ర‌జ‌ల్ని కాపాడుతున్నందుకు వారికి ద‌క్కిన గౌర‌వం ఇది.

తాజాగా ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌పున సంఘీభావంగా అలాంటి ప్ర‌య‌త్నం సాగింది. ప్ర‌భుత్వ‌మే ఓ పాటని రూపొందించి వీరుల‌కు అంకితమిచ్చింది. ఈ పాట‌కు అనూప్ రూబెన్స్ ట్యూన్ క‌ట్టి ఆల‌పించారు. వైయ‌స్సార్ సీపీ ఎంపీ విజ‌య సాయిరెడ్డి ఈ పాట‌ను నిర్మించారు. చందు మొండేటి కాన్సెప్టు అందించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

`సమరం.. సమరం.. విధితో సమరం..` అంటూ సాగే పాటలో ప్ర‌భావ‌వంత‌మైన స్టార్లు జ‌త‌క‌ల‌వ‌డం ఆస‌క్తిక‌రం. ఈ పాటలో కాజల్ అగర్వాల్- నిఖిల్‌- ప్రణీత- పాయ‌ల్ రాజ్ పుత్-సుధీర బాబు- నిధి అగ‌ర్వాల్ భాగమయ్యారు. సినిమా స్టార్ల‌తో పాటు అటు స్పోర్ట్స్ స్టార్స్ ద్రోణ‌వ‌ల్లి హారిక‌- పీవీ సింధు భాగ‌మ‌య్యారు. స్ఫూర్తి నింపుతున్న ఈ వీడియోలో పోలీస్ - వైద్య సిబ్బందిలో ఆత్మ స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్ర‌జ‌ల‌కు మ‌హ‌మ్మారీపై మ‌రింత అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేశారు.