Begin typing your search above and press return to search.

#AA20 లారీ డ్రైవ‌ర్ వ‌ర్సెస్ పోలీస్ గేమ్

By:  Tupaki Desk   |   22 Feb 2020 4:30 AM GMT
#AA20 లారీ డ్రైవ‌ర్ వ‌ర్సెస్ పోలీస్ గేమ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 20వ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర వేగంగా పూర్తి చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు సుకుమార్ డిఫ‌రెంట్ పాయింట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యాన్ని ఎంచుకుని ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లా మ‌లుస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా క‌థాంశంపై ర‌క‌ర‌కాల లీకులు అందాయి. ఇందులో బ‌న్నీ రోల్ ఎలా ఉంటుంది? అన్న దానిపైనా కొంత స‌స్సెన్స్ అయితే కొన‌సాగుతుంది. ఊర మాస్ గెట‌ప్ లో బ‌న్నీ రోల్ ఉంటుంద‌ని ఇప్ప‌టికే లీకులందాయి. శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం దుంగ‌లు స్మ‌గ్లింగ్ చేసే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ఓ వైపు ప్ర‌చారం సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ఇందులో బ‌న్నీ రోల్ కొంత నెగిటివ్ షేడ్ లో ఉంటుందిట‌. లాంగ్ హెయిర్..... గుబురు గ‌డ్డం.. కోర మీసం.. బ‌న్నీ లుక్ ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తుంద‌ట‌. ఆ లుక్ లో అస‌లు బ‌న్నీయేనా? అన్న సందేహం క‌లిగేట్టు చిత్తూరు వాలాని త‌ల‌పించేలా నేచుర‌ల్ గా క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. మూవీ థీమ్ ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ కాబ‌ట్టి.. ఆ పాయింట్ చుట్టూనే క‌థ ఎక్కువ‌ గా తిరుగుతూ బ‌న్నీ పాత్ర‌లో స‌స్పెన్స్ తో అలా ఎంట‌ర్ టైనింగ్ గా సాగి పోతుంద‌ట‌. ముఖ్యంగా అడ‌వుల్లో యాక్ష‌న్ హైలైట్ గా ఉంటుద‌ని చెబుతున్నారు.

అందులోనే నెగిటివ్ షేడ్ ఎలివేట్ అయ్యేలా బ‌న్ని పాత్ర‌ను డిజైన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. లారీ డ్రైవ‌ర్.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ అంటే పోలీసులతో బ‌న్ని వార్ అంతే ర‌క్తి క‌ట్టిస్తుంద‌నే అర్థ‌మ‌వుతోంది. లారీ డ్రైవ‌ర్ వ‌ర్సెస్ కాప్ ఆప‌రేష‌న్ తెర‌పై ర‌క్తి క‌ట్టిస్తుంద‌న్న‌మాట‌. అలాగే ర‌ష్మిక పాత్ర కూడా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని.. అన‌సూయ రంగ‌స్థ‌లం రోల్ ని మించి కిక్కిస్తుంద‌ని ఇప్ప‌టికే కొన్ని లీకులందాయి. బ‌న్నీ ని అంత‌గా మాస్ గా చూపిస్తున్నాడంటే..రష్మిక పాత్ర కూడా ఆ రోల్ కు ధీటుగానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వూ లో ర‌ష్మిక సైతం త‌న పాత్ర స్వ‌రూపాన్ని వివ‌రించ‌కుండా త‌న కెరీర్ లోనే బెస్ట్ అవుతుంద‌ని హింట్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.