Begin typing your search above and press return to search.

కలెక్షన్స్ పరంగా 'ఏ1ఎక్సప్రెస్'.. పరిస్థితి ఏంటి?

By:  Tupaki Desk   |   7 March 2021 12:30 AM GMT
కలెక్షన్స్ పరంగా ఏ1ఎక్సప్రెస్.. పరిస్థితి ఏంటి?
X
ప్రస్థానం సినిమాతో కెరీర్ ప్రారంభించిన యువహీరో సందీప్ కిషన్. తెలుగులో అప్పుడే పాతిక సినిమాలు కంప్లీట్ చేశాడంటే అందరూ నమ్మడానికి కాస్త సమయం పట్టిందనే చెప్పాలి. ప్రస్థానం నుండి ఇప్పటివరకు మధ్యలో హిట్స్ ఫ్లాప్స్ అందుకున్న సందీప్ కెరీర్ కాస్త ఒడిదుడుకులతోనే నెత్తుకొచ్చాడని తెలిసిందే. ఇండస్ట్రీలో ఒక్కోసారి బాగా బజ్ క్రియేట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫలితాన్ని తేకపోవచ్చు. అలాగని కొన్ని సినిమాలు బజ్ లేకపోయినా మౌత్ టాక్ తో జనాలను థియేటర్లకు రప్పించుకుంటాయి. ఇవి రెండు కాకపోతే మరో మార్గం కూడా ఉంది. ఏంటంటే.. ఎంత ఎక్కువ ప్రచారం చేసి జనాల్లోకి తీసుకెళ్తే.. అంత బజ్ క్రియేట్ తో జనాలు కూడా భారీగా రావడం. అలా భారీ బజ్ తో సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా సినిమా 'ఏ1ఎక్సప్రెస్' మూవీ మార్చ్ 5న థియేట్రికల్ రిలీజ్ అయింది.

మరి ఈ మూడింట్లో సందీప్ సినిమా విషయం ఏమైంది అంటే.. అందరూ ఊహించినట్లుగా భారీ ఓపెనింగ్స్ మాత్రం రాబట్టలేకపోయిందట. రెండోది మౌత్ టాక్.. మరి ఈ విధంగా అయినా సినిమా జనాల్లోకి స్ప్రెడ్ అవుతుందా అంటే అంతలా సినిమా గురించి ఎక్కడా వినిపించడం లేదట. కనీసం మౌత్ టాక్ అయినా ఉంటే జనాలు వచ్చి కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మరి అసలు విషయం ప్రేక్షకులకు సినిమా నచ్చిందా లేదా అనేది క్లారిటీ రాలేదు. సినిమా నచ్చితే మైక్ ఎక్కడున్నా పరిగెత్తుకొని వచ్చి వాళ్ల అభిప్రాయం చెబుతారు. అయితే ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో కథలు బాగాలేకపోతే కూడా హిట్ అందుకున్న సినిమాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. సందీప్ సినిమా పై క్లారిటీ రావాలంటే మరింత సమయంపట్టేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఉప్పెన, జాంబిరెడ్డి, 30రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. చూడాలి మరి త్వరలో సందీప్ మూవీ కలెక్షన్స్ ఊపందుకుంటాయేమో! ఈ సినిమాలో లావణ్యత్రిపాఠీ హీరోయిన్ గా నటించింది.