Begin typing your search above and press return to search.

నాకెప్పుడూ డెబ్యూ దర్శకులే.. అందుకే ఈసారి కూడా..!

By:  Tupaki Desk   |   3 March 2021 4:30 PM GMT
నాకెప్పుడూ డెబ్యూ దర్శకులే.. అందుకే ఈసారి కూడా..!
X
టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్థానం సినిమాతో పరిచయయ్యాడు యువహీరో సందీప్ కిషన్. అక్కడి నుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందీప్ కిషన్.. ఫస్ట్ టైం ఓ స్పోర్ట్స్ నేపథ్యంలో ఓ సినిమా చేసాడు.

అదే 'ఏ1ఎక్సప్రెస్'. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా సినిమాకు సంబంధించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. సందీప్ కిషన్ ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపిన విషయాలేంటో చూద్దాం!

*మీ కెరీర్లో ఏ1ఎక్సప్రెస్ ఓ మైలురాయి కాబోతుందా..?

అవునండీ. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నా కెరీర్లో 25వ సినిమాగా ఇది చాలా స్పెషల్. నేను మైలుస్టోన్ అవుతుందనే ఫీల్ భావిస్తున్నాను.

*25వ సినిమా స్పెషల్ అయినప్పుడు రీమేక్ మూవీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు?

చూడండి ఇది రీమేక్ ఫిల్మ్.. అంటే మేం సినిమా మొత్తాన్ని ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయలేదు. జస్ట్ మేం కంటెంట్ మాత్రమే తీసుకున్నాం. నా 25వ సినిమాకు ఇదే పర్ఫెక్ట్ కంటెంట్ అనుకున్నాం చేసేసాం.

*ఈ సినిమాలో మేం ఏమేమి ఎక్సప్రెక్ట్ చేయవచ్చు?

అన్నిటికంటే ముందు మేం అనుకుంది ఏంటంటే.. ఈ సినిమాను ఫ్యామిలీతో వచ్చి ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనీ ప్లాన్ చేసాం. అలాగే మేం చెప్పడానికి ట్రై చేసిన పాయింట్ కూడా క్యాచ్ చేస్తే సరిపోతుందని అనుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఒరిజినల్ వెర్షన్ కంటే గొప్పగా ట్రై చేసాం. అనుకున్న బడ్జెట్ లో అన్ని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం.

*ఈ సినిమాకు సంబంధించి ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్?

అంటే అది నిన్ననే జరిగింది. నిన్ననే సెకండాఫ్ చూసి నాతో తొమ్మిదేళ్లు ట్రావెల్ చేసిన టీం కాల్ చేసి ఏడ్చేస్తున్నారు. వాళ్లు ఏడిస్తే నాకు కూడా కళ్లనుంచి నీళ్లొచ్చేసాయ్. అదే అనుభూతి రేపు థియేటర్లలో ప్రేక్షకులకు కలిగితే బాగుంటుందని అనిపిస్తుంది.

*ఆల్రెడీ రొమాంటిక్-కామెడీ సినిమాలు చేసారు కదా.. ఎమోషనల్ కూడా చేశారు. మరి డిఫరెన్స్ ఎలా అనిపించింది?

రొమాం-కామ్ లో చాలా ఈజీ. సింపుల్ గా మనకు నచ్చినట్లు మనముంటే చాలు. కానీ ఇలాంటి పాత్రలకు ఓ గ్రాఫ్, ఓ జర్నీ, అప్ అండ్ డౌన్స్ లాంటి చాలా ఉంటాయి.

*హీరోయిన్ లావణ్యకు మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది?

ఈ సినిమాలో నాకు లావణ్యకి కెమిస్ట్రీ సూపర్బ్ ఉంటుంది. కానీ కోర్ స్టోరీ అది కాదు కదా అందుకే దీన్ని ఒక కొత్త కమెర్షియల్ ఫిలిం అంటే.. కమింగ్ ఏజ్ మోడరన్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్తాను.

*ఇందులో పొలిటికల్ కష్టాలను చూపించే ప్రయత్నం చేసినట్లు అనిపిస్తుంది?

నోనో.. అసలు ఇందులో పొలిటికల్ అనేదానికి సంబంధం లేదు. ఎంతో కష్టపడుతున్న క్రీడాకారులకు రావాల్సిన గుర్తింపు, ఆదరణ రావట్లేదు. ఈ టాపిక్ ఎందులో తీసుకున్నా ఒకటే. అదే చూపించడానికి ట్రై చేసాం.

*ఈ సినిమా కోసం మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది?

దీనికోసం ఆరు నెలల ముందే హాకీ నేర్చుకున్నా. ఒక అథ్లెట్ రోల్ చెయ్యాలి అంటే వారి కష్టాలతో పాటు ఆట కూడా తెలియాలి. అందుకే మోసం చేయకుండా నేర్చుకొనే చేశా.. సినిమాలో మాత్రం హాకీ గేమ్ విజువల్ గా అదిరిపోతుంది.

*ఈ సినిమాలో రియల్ హాకీ ప్లేయర్స్ జాయిన్ అయ్యారా..?

నిజానికి నేను చేసిన టీంతో పాటుగా ఆపోజిట్ టీంలో ఇండియాకు అండర్ 19 ఆడిన రియల్ హాకీ ప్లేయర్స్ ఉన్నారు. వారు ఒక 7 మంది ఉన్నారు. ఇండియాకు ఆడినవారు కేవలం రోజుకు 5వేలు అడిగారు. నేను షాకయ్యా.. మరీ ఇంత తక్కువా అని. దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు ఇండియాలో ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉందా అని.. అదే పాయింట్ సినిమాలో చూపించే ప్రయత్నం చేసాం.

*క్రికెట్ గేమ్ తో పోలిస్తే ఇండియాలో హాకీ ఆదరణ తక్కువ.. రిస్క్ అనిపించలేదా?

ఇండియాలో క్రికెట్ చాలా పాపులర్ కాబట్టి కొత్తగా ట్రై చెయ్యాలని హాకీ తీసుకున్నాం. వాటిలో గ్రీన్ టర్ఫ్ కనబడితే ఇందులో బ్లూ కనిపిస్తుంది. కొత్తగా ఉంది కాబట్టే రిస్క్ కూడా నేనేం అనుకోలేదు. ఆల్రెడీ క్రికెట్ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి కదా.

*ఏ1ఎక్స్ ప్రెస్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?

మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ అని చెప్తాను. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఫిక్స్ అయ్యాం. సినిమా భారీ హిట్ అవ్వాలి. మళ్లీ ఇదివరకు ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్టు. మేం అనుకున్నది వందశాతం అయితే చేసాం అని చెప్పగలను.

*ఈ సినిమాకి హీరోగా అటువైపు ప్రొడ్యూసర్ కూడా.. ఎలా?

ప్రొడక్షన్ అనేది ఎగ్జైటింగ్ క్రియేటివ్ అనిపిస్తుంది. నిజానికి ప్రొడక్షన్ అంటే ఫైనాన్సియల్ గానే అనుకుంటారు. కానీ అది క్రియేటివ్ జాబ్ మాత్రమే. నేను నమ్మిన సబ్జెక్టులో భాగస్వామి అయ్యాను అంతే.

*ఈ సినిమాకు న్యూ డైరెక్టర్ డెన్నిస్.. రిస్క్ అనిపించలేదా?

నాకెప్పుడూ డెబ్యూ డైరెక్టర్లే వర్కౌట్ అయ్యారు. ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఫస్ట్ లేదా సెకండ్ సినిమా దర్శకులే. లోకేష్ కనగరాజ్, విఐ ఆనంద్ అలా.. సో ఇందులో రిస్క్ అనిపించలేదు. కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది.

*ఓకే చివరిగా మీ తదుపరి సినిమాల గురించి..?

నెక్స్ట్ “రౌడీ బేబీ” రెడీ అవుతోంది. ఇంకా 'వివాహభోజనంబు'లో క్యామియో రోల్ ఉంది. చాలా క్యూట్ మూవీ అది. దాని తర్వాత మహేష్ కోనేరు నిర్మాణంలో ఒకటి. ఏకే ఎంటెర్టైన్మెంట్స్ లో ఒకటి ఉన్నాయి.

ఓకే ఆల్ ది బెస్ట్ సందీప్ కిషన్ గారు. మీ సినిమా సక్సెస్ అవ్వాలని తుపాకీ తరపున మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.