Begin typing your search above and press return to search.

సినిమా ఛాన్స్ ఇప్పిస్తామ‌ని.. యువ‌తిని కార్లో ఎక్కించుకొని

By:  Tupaki Desk   |   31 July 2021 2:30 PM GMT
సినిమా ఛాన్స్ ఇప్పిస్తామ‌ని.. యువ‌తిని కార్లో ఎక్కించుకొని
X
అమ్మాయిల‌పై నిత్యం ఏదో మూల దారుణాలు జ‌రుగుతూనే ఉన్నాయి. దౌర్జ‌న్యం చేస్తూ కొంద‌రు.. న‌మ్మించి మోస‌గిస్తూ మ‌రికొంద‌రు వేధింపుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. తాజాగా.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామ‌ని చెప్పి ఓ యువ‌తిని కారులో ఎక్కించుకొని లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని థానేలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు చూస్తే..

ల‌క్నోకు చెందిన ఒక యువ‌తికి సినిమాల‌పై ఆస‌క్తితో ఆడిష‌న్స్ కు హాజ‌ర‌వుతోంది. ఈ క్ర‌మంలోనే కొన్నాళ్ల క్రితం ఆడిష‌న్ కు పిలిచిన వారి నుంచి మ‌ళ్లీ ఫోన్ వ‌చ్చింది. ఓ చిత్రంలోని పాత్ర‌కు సెల‌క్ట్ అయ్యావంటూ చెప్పారు. దీంతో.. ఎంత‌గానో సంతోషించింది. ద‌ర్శ‌క‌, నిర్మాత పిలుస్తున్నార‌ని, అడ్ర‌స్ చెప్పి ర‌మ్మ‌న్నారు.

అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత‌.. నిర్మాత ఫామ్ హౌస్ కు వెళ్లాల‌ని చెప్పి, కారులో ఎక్కించుకున్నారు. ఆ త‌ర్వాత కారులో ఉన్నంత సేపూ ఒక వ్య‌క్తి ఆమెప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లు పెట్టాడు. స‌ద‌రు యువ‌తి ప్ర‌తిఘ‌టించ‌డంతో.. తుపాకీ చూపించి బెదిరించాడు. త‌మ కోరిక తీరిస్తేనే సినిమ‌లో ఛాన్స్ వ‌స్తుంద‌ని అన్నారు. దీంతో.. ఆమె మారు మాట్లాడ‌కుండా కారులో కూర్చుఒంది.

ఫామ్ హౌస్ కు చేరుకున్న త‌ర్వాత త‌న మొబైల్ ఫోన్ ద్వారా త‌ల్లిదండ్రుల‌కు, మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ్ సేన విభాగానికి లొకేష‌న్ షేర్ చేసింది. తాను ఆప‌ద‌లో ఉన్నాన‌ని తెలిపింది. దీంతో.. ఆ సేన కార్య‌క‌ర్త‌లు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. సాధ్యమైనంత వేగంగా ప్ర‌యాణించి, త్వ‌ర‌గా అక్క‌డికి చేరుకున్నారు. బాధితురాలిని సుర‌క్షితంగా కాపాడారు. నిందితుల‌ను పోలీసుల‌కు అప్ప‌గించారు.