పుష్ప విలన్ ఎంత పని చేశాడంటే..!

Mon May 03 2021 08:00:00 GMT+0530 (IST)

A star hero with a never ending schedule in Mollywood

ఓవైపు కరోనా సెకండ్ వేవ్ టెన్షన్స్ కొనసాగుతున్న బన్ని పుష్ప చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆయనకు కూడా కోవిడ్ సోకింది. తర్వాత షూట్ కి బ్రేక్ ఇచ్చి హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. కానీ షూటింగ్ మాత్రం ఆపలేదు. సుకుమార్ మొండి ధైర్యంతో కంటిన్యూ చేశారు. దానిపై బోలెడన్ని విమర్శలొచ్చాయి. అయినా అంత కష్టంలో భయంలో అలా ఎందుకని చేయాల్సొచ్చింది? అంటే...!అందుకు కారకుడు ఈ సినిమాలో నటిస్తున్న విలన్ ఫహద్ ఫాజిల్. అతడిని ఒకసారి వదిలేస్తే తిరిగి పట్టుకోవడం చాలా కష్టం. మాలీవుడ్ లో క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో ఉన్న స్టార్ హీరో అతడు. అందుకే ఎట్టి పరిస్థితిలో ఆయనతో సీన్లను పూర్తి చేయాలని సుక్కూ కంకణం కట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరగడంతో టెన్షన్ వాతావరణం అలుముకుంది. దాంతో ఫహద్ సడెన్ గా షూట్ కి రాలేనని వెళ్లిపోయారట. ఆయనతో పాటు సేమ్ టైమ్ అతడి సతీమణి నజ్రియా కూడా నగరంలో షూటింగులో పాల్గొంటున్నారు. ఇద్దరూ కలిసి వెళ్లిపోయారట. అయితే ఆయనంతట ఆయనే వెళ్లారు కాబట్టి తిరిగి కాల్షీట్లు ఏదోలా సర్ధుబాటు చేస్తారనే భావిస్తున్నారు.

ఇక పుష్ప చిత్రీకరణ మెజారిటీ పార్ట్ ని వేగంగా పూర్తి చేశారట. సెకండ్ వేవ్ తగ్గితే తదుపరి షూట్ ని పూర్తి చేస్తారు. ఇక పుష్ప పాన్ ఇండియా మూవీ కాబట్టి రిలీజ్ కోసమే అభిమానుల వెయిటింగ్. ఇందులో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టీజర్ అంచనాలు పెంచాయి. లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా బన్ని మాస్ యాక్షన్ మరో లెవల్లో ఉంటుందని సమాచారం. రష్మిక మందన- అనసూయ ట్రీట్ ఆ రేంజులోనే ఉంటుందట.