#చెర్రోపాసన! స్పోర్ట్స్ క్లబ్ లో కొట్లాట చివరికలా!

Fri Jan 28 2022 11:01:17 GMT+0530 (IST)

A star couple who fight like dogs and cats

ఆలుమగల మధ్య అనుబంధం సాన్నిహిత్యం సమకుదిరితే ఆ జంట సంసారంలో ఆనందానికి కొదవేమీ ఉండదు. ఇక చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడిన సఖుడికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. అది చాలా అరుదైన అదృష్టం. లైఫ్ లో ప్రతి చిన్న బిట్ ని ఆస్వాధించేంత అవకాశం ఈ జంటకు ఉంటుంది.టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన క్లాస్ మేట్ ఉపాసన కామినేనిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమలోని స్టార్ కపుల్స్ లో ఎంతో పరిణతితో వ్యవహరించే జంటగా వీరికి పేరుంది. ఆ ఇరువురి మధ్యా స్నేహానుబంధం ఎంతో గొప్పది. ఈ జంట విదేశీ విహారయాత్రలు వర్క్ లైఫ్ వగైరా తెలిసినదే.

రామ్ చరణ్ ఓ సందర్భంలో ఉపాసనతో తన పరిచయం రిలేషన్ లో ఓ సరదా విషయాన్ని తెలిపారు. ``ఉపాసన .. నేను స్పోర్ట్స్ క్లబ్ లో కలుసుకున్నాం. ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. మేము చాలా బాగా కలిసిపోయాం. అదే సమయంలో మేము పిల్లులు కుక్కల వలె ఒకరిపై ఒకరు చట్నీలు సాస్ లు విసురుకుంటూ పోట్లాడుకున్నాం. ఒకరికొకరం వాదించుకోవడం అందులోనే కంఫర్ట్ జోన్ ను కూడా కనుగొన్నాము. మేము ఒకరినొకరం నిజంగా ప్రేమిస్తున్నామని ఏదో ఒక రోజు ఇద్దరిలో ఒకరు క్లబ్ కు రాకపోతే ఒకరినొకరు కోల్పోతామని అర్థం చేసుకోవడానికి మాకు ఐదు సంవత్సరాలు పట్టింది`` అని రామ్ చరణ్ అన్నారు.

ఆలుమగల మధ్య చిన్నపాటి పొరపొచ్చాలు సహజం. కానీ రామ్ చరణ్ - ఉపాసనల అనుబంధం ప్రేమానుబంధం. అది మరింత ధృఢంగా ఉందని చరణ్ చేసిన ఆ వ్యాఖ్య స్పష్టంగా సూచిస్తుంది. ఉపాసన తన అత్తమామలు భర్త పట్ల ఎంతో ప్రేమాభిమానాల్ని కలిగి ఉంటారు. తన అత్త గారు తనకు అన్నివిధాలా తల్లితో సమానమని ఆనందం వ్యక్తం చేస్తుంటారు. ఇక చరణ్ కెరీర్ భవిష్యత్ గురించి ఎంతో సహకరిస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన RRR .. ఆచార్య విడుదల కావాల్సి ఉంది. ఆర్.సి 15 సినిమాకి సంబంధించిన విషయాల్లో చరణ్ కి ఉపాసన సహకారిగా ఉన్నారని సమాచారం. మరోవైపు అపోలో హెల్త్ మ్యాగజైన్ బాధ్యతల్ని ఉపాసన నెరవేరుస్తున్నారు.