కోవిడ్ విలయంపై కవిత రూపంలో గూఢచారి గాళ్ ఆవేదన

Mon May 03 2021 21:00:01 GMT+0530 (IST)

A spy girl files a poem on covid Vilayam

కోవిడ్ -19 సెకండ్ వేవ్ వేలాది కుటుంబాలను నాశనం చేసింది. ప్రతిరోజూ వందలాది మంది చనిపోతున్నారు. ఇతరులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. సోను సూద్- తాప్సీ- భూమి పెడ్నేకర్  పలువురు నటులు అవసరమైన వారికి సహాయం చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.తాజాగా ఈ పరిస్థితికి చలించిపోయిన తెనాలి అమ్మాయి.. గూఢచారి ఫేం శోభిత ధూలిపాళ కోవిడ్ విలయంపై కవిత రాశారు. భారతదేశంపై కోవిడ్ సెకండ్ వేవ్ చూపించిన ప్రభావాన్ని ప్రతిబింబిస్తూ హృదయాన్ని కలచివేస్తున్న తీరుపై కవిత రాశారు. ``నేను భయపడుతున్నాను.. గుండెకు గాయమైంది.. నావాళ్లను తీసుకెళ్లిపోతోంది. నొప్పిలేకుండా మరణానంతర జీవితం వాగ్దానంతో..``  అంటూ తన కవితలో రాసారు. మేలో పూలు పూసే గుల్ మొహర్ చెట్టుకింద కూచున్న దేవుడు అన్నీ చూస్తున్నాడు. పేద(స్మాల్)- ధనికులు (బిగ్) అనే తేడా లేదు.. అంటూ ఎమోషనల్ టచ్ ఇచ్చారు శోభిత.

గూఢచారి తర్వాత రెండోసారి అడివి శేష్ తో కలిసి `మేజర్`లో శోభిత కనిపించనుంది. అంతర్జాతీయ చిత్రం మంకీ మ్యాన్ లోనూ శోభిత నాయికగా నటిస్తోంది. స్లమ్ డాగ్ ఫేం దేవ్ పటేల్ కథానాయకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.