అన్ స్టాపబుల్ కోసం ప్రభాస్.. భారీ హంగామా..!

Wed Dec 07 2022 09:06:51 GMT+0530 (India Standard Time)

A special set-up has been arranged for Prabhas.

బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2లో జరిగిన ఐదు ఎపిసోడ్స్ తోనే బీభత్సం సృష్టిస్తుండగా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ మరింత భారీగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇంతకీ బాలయ్య ముందు హాట్ చెయిర్ లో నెక్స్ట్ వచ్చే గెస్ట్ ఎవరు అంటే బాహుబలి ప్రభాస్ అని తెలుస్తుంది.ప్రభాస్ బాలకృష్ణ అసలేమాత్రం ఊహించని కాంబో ఇది. ఎప్పుడూ క్యాజువల్ గా కూడా వీరిద్దరు ఎదురుపడలేదు. బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కాగా.. ఆ సినిమా సాధించిన విజయాన్ని తెలుసుకుని బాలకృష్ణ అప్పట్లో టీం అందరిని విష్ చేశారు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ కు రెడీ అయ్యారు బాలయ్య.

అన్ స్టాపబుల్ సీజన్ 2లో స్పెషల్ గెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారట. దీనికి సంబంధించిన షూటింగ్ మొదలైనట్టు తెలుస్తుంది. ప్రభాస్ కి గ్రాండ్ వెల్కం చెబుతూ షూటింగ్ చేస్తున్నారట. హైదరాబాద్ సిటీలో పలు చోట్ల ప్రభాస్ కోసం ప్రత్యేకమైన సెటప్ ఎరేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఈ స్పెషల్ ఏవీ షూట్ జరిగినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఎదుట ప్రభాస్ ఆ ఫ్రేమే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

ప్రభాస్ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలతో పాటుగా తన ఫుడ్.. ఇంకా వర్క్ అవుట్స్.. డేటింగ్ రూమర్స్ ఇలా అన్నిటి మీద బాలకృష్ణ ఒక క్లారిటీ తీసుకునే ఛాన్స్ ఉంది. తెలుగు హీరోగా ఉన్న ప్రభాస్ బాలీవుడ్ నుంచి వెళ్లిన మొదటి పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో తనకు వస్తున్న రెస్పాన్స్..

ఫ్యాన్స్ గురించి అన్ని విషయాల మీద ప్రభాస్ తో బాలకృష్ణ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్యనే తన పెదనాన్నని దూరం చేసుకున్న ప్రభాస్ ఆయన లేని లోటుని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు. కృష్ణం రాజు కూతుళ్ల బాధ్యతల గురించి కూడా బాలకృష్ణ ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

ఓ పక్క బాహుబలి మరో పక్క నందమూరి నట సింహం కచ్చితంగా ఈ ఎపిసోడ్ మిగతా ఇంటర్వ్యూస్ అన్నిటినీ బీట్ చేసి ఆహా ఓటీటీలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ప్రభాస్ తో పాటుగా ఓ స్టార్ డైరెక్టర్ కూడా అతనితో ఇంటర్వ్యూకి వస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ ప్రోమో కోసం అటు నందమూరి ఫ్యాన్స్.. ఇటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంటారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.