Begin typing your search above and press return to search.

'తియ్యగుంది' అని బుక్కయిన బ్రహ్మాజీ

By:  Tupaki Desk   |   31 July 2021 12:30 PM GMT
తియ్యగుంది అని బుక్కయిన బ్రహ్మాజీ
X
సత్యదేవ్‌ హీరోగా ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌ గా రూపొందిన తిమ్మరుసు సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్‌ రివ్యూస్ ను దక్కించుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో వచ్చిన మొదటి సినిమా అవ్వడం వల్ల తిమ్మరుసు గురించి ప్రత్యేక చర్చ జరిగింది. పైగా ఈ సినిమాలో నటించిన సత్యదేవ్‌ ఈమద్య కాలంలో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. అందుకే సినిమా గురించి సోషల్‌ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.

సినిమాలో బ్రహ్మాజీ ఒక సన్నివేశంలో కొబ్బరి బొండా తాగి తియ్యగుంది అంటూ చేసిన వ్యాఖ్య ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్ అయ్యింది. తియ్యగుంది అనే పదం రాగానే చాలా మందికి నారా లోకేష్‌ గుర్తుకు వస్తారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఒకానొక సమయంలో క్షేత్ర స్థాయిలో లోకేష్ పర్యటిస్తూ మజ్జిక తాగి భలే తియ్యగుంది అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. కొందరు చాలా పాజిటివ్‌ గా ఆ విషయాన్ని తీసుకుంటే కొందరు మాత్రం ట్రోల్‌ చేశారు. అందువల్ల చాలా మంది ఇప్పటికి కూడా తియ్యగుంది అంటూ లోకేష్‌ ను పలు సందర్బాల్లో ఇమిటేట్‌ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

తాజాగా తిమ్మరుసులో కూడా బ్రహ్మాజీ ఆ పదంను వాడాడు. అందులో లోకేష్‌ ను కించ పర్చడం కాని మరేది కాని లేదు అంటూ కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం నారా లోకేష్ ను అవమానించినట్లుగా బ్రహ్మాజీతో ఆ పదంను చెప్పించారంటూ సినిమా యూనిట్‌ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బ్రహ్మాజీ ఇప్పుడు తియ్యగుండి డైలాగ్ వల్ల చర్చనీయాంశంగా మారిపోయాడు. మొత్తానికి తెలిసి అన్నాడో తెలియక అన్నాడో కాని బ్రహ్మాజీ ఇప్పుడు ఆ పదం వల్ల బుక్కయ్యాడు. మరి ఏమైనా ఆ విషయమై బ్రహ్మాజీ స్పందిస్తాడేమో చూడాలి.