Begin typing your search above and press return to search.

ప్లాస్మా దానంపై స్ఫూర్తి ర‌గిలిస్తున్న హీరో

By:  Tupaki Desk   |   11 July 2020 4:30 AM GMT
ప్లాస్మా దానంపై స్ఫూర్తి ర‌గిలిస్తున్న హీరో
X
ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ క్రైసిస్ ని బ‌యోవార్ గా భావించి భార‌త‌దేశం పోరాడుతోంది. ప్ర‌పంచ‌దేశాలు ఇదే స్ఫూర్తితో అలుపెర‌గ‌ని పోరాటం సాగిస్తున్నాయి. దానివ‌ల్ల‌నే అంతో ఇంతో వైర‌స్ అదుపులో ఉంది. లేదంటే ఈపాటికే కోట్లాదిమందిని చాప చుట్టేసేది. ఇక ఇరుగుపొరుగు బావుంటేనే మ‌న‌మంతా బావుంటాం. రాష్ట్రం దేశం ప్ర‌పంచం బావుంటుంది. అందుకే కొవిడ్ కి చికిత్స పొంది ఇంటికి వెళ్లిన పేషెంట్స్ త‌ప్ప‌నిస‌రిగా త‌మ ప్లాస్మాను ఇచ్చి సాటి మ‌నుషుల్ని కాపాడాల్సిన బాధ్య‌త ఉంద‌ని చెప్పాలి.

ప్లాస్మా డొనేష‌న్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది పేషెంట్ల‌కు అది సంజీవ‌నిలానే ప‌ని చేస్తోంద‌న్న రిపోర్ట్ వ‌చ్చింది. ముఖ్యంగా సీరియ‌స్ గా ఉన్న రోగుల‌కు ఇది వ‌ర్క‌వుట‌వుతోంది. అందుకే తెలంగాణ‌-ఏపీ ప్ర‌భుత్వాలు ప్లాస్మా డొనేష‌న్ ని ఎంక‌రేజ్ చేసి చికిత్స‌ను అందిస్తున్నాయి. ఇందుకు సెల‌బ్రిటీలు ప్ర‌చారం చేస్తున్నారు.

ఇటీవ‌ల‌ పాపులర్ యంగ్ హీరో శ్రీ విష్ణు సోషల్ మీడియాలో ప్లాస్మా డొనేష‌న్ గురించి ప్ర‌చారం చేశారు. 68 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ వృద్ధుని ప్రాణాలను కాపాడటానికి అప్ప‌టికే చికిత్స పొంది కోలుకున్న‌వాళ్ల‌ను బ్లడ్ ప్లాస్మాను దానం చేయాలని కోరారు. ఇప్పుడు మ‌రోసారి చొరవ తీసుకుని ప్లాస్మాను డొనేట్ చేయాల‌ని ప్ర‌చారం చేస్తున్నారు.

ప్లాస్మా దానంపై ప్రజలలో అవగాహన పెంచే ప్ర‌య‌త్నం శ్రీ‌విష్ణు చేస్తున్నారు. తన స్నేహితుడు నారా రోహిత్ .. బ్రోచెవరేవరురా కోస్టార్ నివేదా థామస్ లకు ట్వీట్ ద్వారా సవాల్‌ విసిరారు. ప్లాస్మా డొనేష‌న్ ప్ర‌చారానికి నేను సైతం అంటై సెల‌బ్రిటీలు కదిలి రావాల‌న్న‌ది యువ‌హీరో శ్రీ‌విష్ణు అభ్య‌ర్థ‌న‌. మ‌రి దీనిని మ‌న హీరోలు హీరోయిన్లు ఉద్య‌మంలా ముందుకు తీసుకెళ‌తారా లేదా? అన్న‌ది చూడాలి.