Begin typing your search above and press return to search.

బాలయ్య చెంపదెబ్బపై స్పందించిన అభిమాని

By:  Tupaki Desk   |   6 March 2021 12:40 PM GMT
బాలయ్య చెంపదెబ్బపై స్పందించిన అభిమాని
X
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే కం అగ్రహీరో బాలకృష్ణ. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా బాలయ్యబాబు ఓ అభిమానిని కొట్టడం దుమారం రేపింది.
హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫొటో తీయడానికి అభిమాని ప్రయత్నించాడు. అతడిపై బాలక్రిష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంప చెల్లుమనిపించారు.గతంలోనూ బాలక్రిష్ణ అభిమానులపై దాడులు చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడూ ఓ యువకుడిపై చేయిచేసుకోవడం మరోసారి వార్తల్లో నిలిచింది.

బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న అభిమాని సోము తాజాగా స్పందించాడు. 'బాలయ్య టచ్ చేసినందుకు గర్వంగా ఉందని.. ప్రచారంలో బాలయ్య ఎవ్వరికీ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదని.. అలాంటిది నన్ను టచ్ చేశాడని సోము పేర్కొనడం విశేషం.మా అన్నయ్య ఇంటికి వచ్చిన బాలయ్య.. నన్ను బయటి వ్యక్తి అనుకొని పక్కకు తోసేశాడని.. ఇలాంటి వాటిని మేము పట్టించుకోం అని ఓ వీడియో రిలీజ్ చేశాడు.

దీంతో బాలయ్య కొట్టిన వివాదానికి పుల్ స్టాప్ పడింది. ఆ అభిమాని సీరియస్ గా రియాక్ట్ అయితే బాలయ్య బాబు ఇరుకునపడేవాడు. కానీ ఈ సమస్యను టీడీపీ నేతలే చాకచక్యంగా పరిష్కరించినట్టు తెలుస్తోంది. అయినా బాలయ్య ఇంకా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.