అసభ్యకర వీడియోతో సినీ నటిని బెదిరిస్తున్న కాలేజీ యజమాని

Tue Feb 23 2021 06:00:01 GMT+0530 (IST)

A college owner threatening a movie star with an obscene video

ఒక సినీ నటిని ఓ కాలేజీ యజమాని లైంగికంగా వేధించిన ఘటన చెన్నైలో జరిగింది. మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి తనతో అసభ్యకర దృశ్యాలు తీసి బెదిరింపులకు పాల్పడుతున్న ఓ కాలేజీ యజమాని నుంచి రక్షించాలని చెన్నైకు చెందిన ఒక నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.చెన్నై నగర శివారులో కాలేజీలు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి తమిళ్ సినిమాల్లో నటించిన నటితో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. అందుకు గాను ఆ సినిమా విషయమై చర్చించేందుకు తన ఆఫీసును ఆమెకు ఆహ్వానించాడు. ఆఫీసులో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి సృహ తప్పిన తర్వాత అసభ్యకరంగా చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వీడియోను చూపిస్తూ తాను చెప్పినట్లు వినకపోతే బయటపెడుతానని బెదిరించాడని సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కాలేజీ యజమాని తన అనుచరులతో కలిసి ఇంటికొచ్చి బెదిరించాడని చెప్పింది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె తెలిపింది.ఈ సందర్భంగా కాలేజీ యజమాని నుంచి తనకు రక్షణ కల్పించాలని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ నటి పోలీసులను కోరింది.