ఓ మ్యూజిక్ కంపోజర్ ప్రాణం తీసిన యూట్యూబ్ ఛానల్!

Thu Jun 18 2020 17:40:40 GMT+0530 (IST)

A Music Composer Death By Youtube Channel

స్నేహంతో చేరదీస్తే ప్రాణాలు కోల్పోయే పని చేసాడు ఓ మ్యూజిక్ కంపోజర్. ఒక యూట్యూబ్ ఛానల్ విషయంలో ఓ యంగ్ మ్యూజిక్ కంపోజర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ద్వారకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోకి ద్వారకకు చెందిన భోజ్‌పురి మ్యూజిక్ కంపోజర్ ముఖేశ్ చౌదరి ఓ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ముఖేష్ సంతోష్ విక్కీలను పరిచయం చేసుకున్నాడు. ఒకే రంగం కాబట్టి తక్కువ కాలంలోనే ముగ్గురు సన్నిహితులు అయ్యారు. అలా స్నేహంగా ఉన్న వారు.. ఓ రోజు సంతోష్ విక్కీల 'ఆర్యన్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా' యూట్యూబ్ ఛానల్ పాస్‌వర్డ్ యూజర్ ఐడీని ముఖేశ్‌తో షేర్ చేశాడు. ఆ తర్వాత కొద్దిరోజులకు సంతోష్ ఛానల్ యూట్యూబ్ లో కనిపించక పోవడంతో డిలేట్ అయిందని తెలుసుకున్నాడు. ఇక తమ ఛానల్ ను ముఖేశ్ తొలగించాడని సంతోష్ విక్కీలు నిర్ణయించుకొని కక్ష పెంచుకున్నారు.ఎలా అయినా ముఖేష్ పై పగ తీర్చుకోవాలని వారం రోజుల క్రితం ముఖేశ్ స్టూడియోకు వెళ్లి.. ముఖేష్ చేతులు కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపేశారు. ఆ వెంటనే ఓ దుప్పటిలో శవాన్ని చుట్టి టేబుల్ కింద దాచి అక్కడి విలువైన వస్తువులతో పరరాయ్యారు. నాలుగు రోజుల తర్వాత స్టూడియో నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు స్టూడియోలోని టేబుల్ కింద కుళ్లిన స్థితిలో ముఖేశ్ మృతదేహం లభించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సంతోష్ విక్కీలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నారు. సంతోష్ తన కంటే పాపులర్ అయిపోతాడనే కుళ్ళుతో ముఖేశ్.. తమ ఆర్యన్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా యూట్యూబ్ ఛానల్‌ను డిలేట్ చేసాడని తెలిపారు సంతోష్ విక్కీలు. ఆ ఛానల్ తొలగించడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో షాక్ కి గురిచేస్తుంది.