జీరో సైజ్ తో సంపుతున్న అనూ..!!

Thu Jun 17 2021 09:00:02 GMT+0530 (IST)

A Glamourous Dump Of Photos From Anu

అజ్ఞాతవాసి - నా పేరు సూర్య లాంటి భారీ చిత్రాల్లో నటించిన అనూ ఇమ్మాన్యుయేల్ కెరీర్ పరంగా ఆశించినది ఒకటి అయితే ఎదురైనది ఇంకొకటి. అగ్ర హీరోలు తన కెరీర్ కి అస్సెట్ కాలేకపోయారు. అయినా అనూ ఇప్పటికీ కంబ్యాక్ కోసం పడుతున్న తపన సర్వత్రా యువతరంలో ఆసక్తికర చర్చకు తావిస్తోంది.ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన అల్లుడు అదుర్స్ లో నటించిన అనూకి మరోసారి నిరాశే ఎదురైంది. అయినా కెరీర్ పరంగా ఏమాత్రం నిరాశ చెందక ప్రయత్నిస్తూనే ఉంది. వరుసగా అవకాశాలు కల్పిస్తోంది తెలుగు సినీపరిశ్రమ. ప్రస్తుతం అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహా సముద్రంలో అనూ కథానాయికగా నటిస్తోంది. అలాగే అల్లు శిరీష్ సరసన ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది. సహజీవనం నేపథ్యంలో ఆద్యంతం యువతరం మతి చెడగొట్టే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై ఆకట్టుకున్నాయి. `ప్రేమ కాదంట` అనే టైటిల్ ని ఖరారు చేశారు. అల్లు శిరీష్ -అనూ రొమాన్స్ ఈ చిత్రంలో పీక్స్ లో ఉంటుందని అర్థమైంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలపై చాలా హోప్ తో ఉంది. విజయం దక్కితే తనకు కెరీర్ పరంగా డ్రైవ్ సులువు అవుతుంది. ఇక సోషల్ మీడియాల్లో నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ అనూ భారీ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తాజాగా జీన్స్ వైట్ టాప్ ధరించి సైజ్ జీరో లుక్ తో స్టైలిష్ గా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ వైరల్ గా మారింది.