Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ :ఉత్కంఠభరితంగా 'ఏ' (ఏడీ ఇన్ఫినిటమ్)...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 8:00 AM GMT
టీజర్ టాక్ :ఉత్కంఠభరితంగా ఏ (ఏడీ ఇన్ఫినిటమ్)...!
X
ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త తరహా సినిమాలకు విభిన్నమైన కథలకు ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ జానర్ సినిమాలు చూడడానికి ఎప్పుడూ ఒక తరహా సినీ ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. ఈ కోవలోనే రాబోతున్న సినిమా 'ఏ' (ఏడీ ఇన్ఫినిటమ్). నితిన్ ప్రసన్న - ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన ఈ చిత్రం విభిన్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తి పెంచిన చిత్ర బృందం ఇప్పుడు ఆసక్తికర టీజర్ తో ముందుకు వచ్చారు. ఉత్కంఠభరితంగా ఉన్న 'ఏ' (ఏ డి ఇన్ఫినిటమ్) చిత్ర టీజర్ ఇవాళ ప్రముఖ ఏస్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసారు.

ఈ టీజర్ లో ఓ ఫ్యామిలీలో బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. ఆ బాలిక మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటీ అనే కోణంలో ఈ చిత్రం రూపొందినట్లుగా టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పవచ్చు. ''కొన్నిసార్లు వాస్తవాలు కల్పన కంటే స్ట్రేంజర్ గా ఉంటాయి'' అనే ఇతివృత్తంతో ఈ సినిమా ఉండబోతోంది. యుగంధర్ ముని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా విజయ్ కూరాకుల సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో గీతా మిన్సాల నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ కె బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. నితిన్ ప్రసన్న తన మొదటి సినిమా అయినా మూడు విభిన్నమైన పాత్రలలో ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ప్రీతి అస్రాని స్మాల్ స్క్రీన్ పై పలు సీరియళ్లతో పాటు సిల్వర్ స్క్రీన్ పై 'మళ్ళీరావా' 'ప్రెజర్ కుక్కర్' సినిమాలతో అలరించింది. ప్రస్తుతం 'ఏ' (ఏడీ ఇన్ఫినిటమ్) మూవీ టీజర్ వైరల్ అవుతోంది.