Begin typing your search above and press return to search.

90 ఏళ్ల వయసులో హీరో రియల్‌ హీరో ఫీట్‌

By:  Tupaki Desk   |   14 Oct 2021 7:39 AM GMT
90 ఏళ్ల వయసులో హీరో రియల్‌ హీరో ఫీట్‌
X
కెనడియన్ నటుడు విలియమ్‌ షాట్‌ నర్ నటుడిగా ఎన్నో అద్బుత పాత్రలు పోషించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. 90 ఏళ్ల ఆ హీరో ఇన్నేళ్ల తన జీవితంలో ఇప్పుడు చేసిన ఆ 11 నిమిషాల జర్నీ ఒక అద్బుతం అని.. తన జీవిత కాలం మొత్తం సాధించింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు సాధించింది ఒక ఎత్తు అని.. తన జీవిత కాలంలో అతి పెద్ద గొప్ప అద్బుత విజయం ఇది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆయన ఇంతకు సాధించింది ఏంటో తెలుసా.. 11 నిమిషాల పాటు అంతరిక్ష యానంను సాగించాడు. విలియమ్ తో పాటు నలుగురు అంతరిక్ష యానం చేసి చరిత్ర సృష్టించారు. 11 నిమిషాల పాటు వారు కొనసాగించిన అంతరిక్ష యాణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

కొన్ని వారాల క్రితం జెఫ్‌ బెజోస్‌ తన సొంత స్పేస్ సంస్థ నౌక బ్లూ ఆరిజన్ లో అంతరిక్ష యానం చేసిన విషయం తెల్సిందే. అతడు చేసిన మొదటి అంతరిక్ష యానం సక్సెస్‌ అవ్వడంతో మరింత మంది అంతరిక్షంలో అనుభవంను పంచుకునేందుకు వెళ్తున్నారు. తాజాగా విలియమ్ సహా మొత్తం అయిదుగురు వెళ్లారు. వారు ఒక అద్బుతమైన జర్నీని సాగించాం అంటూ ఆనందంగా ఉన్నారు. ఈ వయసులో ఆయన ఈ ఫీట్ ను దక్కించుకోవడం గొప్ప విషయం. భవిష్యత్తులో ఇలాంటి పర్యటనలు చాలా కామన్ అవ్వొచ్చు. కాని ఇప్పుడు మాత్రం ఈ ప్రయాణం చేసిన వారు హీరోలే అనడంలో సందేహం లేదు.

విలియమ్ 90 ఏళ్ల వయసులో రియల్‌ హీరోలు చేసే ఫీట్ ను చేశాడు. సుదీర్ఘమైన సినీ కెరీర్ ను కలిగి ఉన్న విలియమ్‌ హీరోగా మంచి పేరు దక్కించుకున్నా రియల్‌ హీరోగా మాత్రం ఈ ప్రయాణంతోనే పేరు దక్కించుకున్నాడు అనడంలో సందేహం లేదు. 90 ఏళ్ల విలియమ్‌ నటుడిగా సాధించిన విజయాల కంటే ఈ విజయం తన కెరీర్ లో కీలకం అన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అత్యధిక వయసు ఉన్న వ్యక్తి స్పేస్‌ జర్నీ చేయడం ఇతే ప్రథమం. చరిత్రలో విలియమ్‌ షాట్ నర్ పేరు నిలిచి పోనుంది.