Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ బాక్సాఫీస్ రికార్డుకు 9ఏళ్లు..!

By:  Tupaki Desk   |   11 May 2021 2:30 PM GMT
పవర్ స్టార్ బాక్సాఫీస్ రికార్డుకు 9ఏళ్లు..!
X
సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు రికార్డులు తిరగరాయడానికి అని ప్రూవ్ చేసిన సినిమా గబ్బర్ సింగ్. మార్కెట్‌లో గబ్బర్ సింగ్ ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వస్తుంది. పదేళ్లు వరస ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత ఏ హీరోకైనా ఫ్యాన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోరు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అలా కాలేదు. 'నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తానని' చెప్పి పవన్ ఒక్కసారిగా సంచలనం సృష్టించాడు. అందుకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'గా 2012లో ఓ సంచలనం అయ్యాడు. గబ్బర్ సింగ్ సినిమా వచ్చి నేటికీ 9 ఏళ్లైంది. కానీ గబ్బర్ సింగ్ జోరు ఇంకా తగ్గలేదు.

మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే.. ఆ మాత్రం క్రేజ్ ఉంటుందని అంటున్నారు ఫ్యాన్స్. 2012లో ప‌వ‌న్ కళ్యాణ్ అసలు హిట్ అందుకున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ వ‌చ్చి అప్పుడే 9 ఏళ్ళైయిందంటే నమ్మలేకపోతున్నారు ఫ్యాన్స్. 2012 మే 11న గబ్బర్ సింగ్ చిత్రం విడుద‌లైంది. ఆరోజుల్లోనే గబ్బర్ సింగ్ 69 కోట్ల షేర్ వ‌సూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప‌వ‌న్ ఇమేజ్ తో పాటు డైరెక్టర్ టేకింగ్ - అంత్యాక్ష‌రి ఎపిసోడ్ - క‌బ‌డ్డి ఎపిసోడ్ - దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట‌లు - శృతిహాసన్ గ్లామర్.. అన్నీ వర్కౌట్ అయ్యాయి. అప్ప‌టివ‌ర‌కు ప్లాపుల్లో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ మూవీతో బాక్సాఫీస్ పై పంజా విసిరాడు.

గ‌బ్బ‌ర్ సింగ్ తో పవర్ స్టార్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అలాగే నిర్మాతగా బండ్ల గ‌ణేష్ ఈ చిత్రంతో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. గతేడాది గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మీద 24గంటలలో కోటి 38 ల‌క్ష‌ల ట్వీట్లు చేశారు ఫ్యాన్స్. కేవలం టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లార్జెస్ట్ మూవీ ట్రెండ్ గబ్బర్ సింగే సెట్ చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏకంగా 13.8 మిలియ‌న్ల‌తో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పారు. హీరోల ఫ్యాన్స్‌కు ఇలా ట్రెండ్స్‌లో రికార్డులు న‌మోదు చేయ‌డం ఇదే ప్ర‌తిష్టాత్మ‌కం. ఈ రికార్డు పవన్ కే సాధ్యమని ఫ్యాన్స్ నిరూపించారు. ప్రస్తుతం పవన్ -హరీష్ శంకర్ - దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో మరో సినిమాకు రంగం సిద్ధం అవుతోంది.