Begin typing your search above and press return to search.

'ఏజెంట్' కి 60 కోట్లు..అఖిల్ తో సాహ‌స‌మే సూరి!

By:  Tupaki Desk   |   8 July 2022 2:30 AM GMT
ఏజెంట్ కి 60 కోట్లు..అఖిల్ తో సాహ‌స‌మే సూరి!
X
అక్కినేని వార‌సుడు అఖిల్ బ్యాచిల‌ర్ తో సిస‌లైన స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడా స‌క్సెస్ ని కంటున్యూ చేయాలి. ఇమేజ్ ని రెట్టింపు చేసుకోవాలి. ప్ర‌స్తుతమున్న పోటీని త‌ట్టుకుని మార్కెట్ లో నిలబ‌డాలంటే బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకోక‌పోతే క‌ష్టం. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫ‌లితాలు తేడాగా వ‌స్తే? ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్ప‌టికే రుచి చూసాడు.

అందుకే ఏరికోరి మ‌రీ స్టైలిష్ మేక‌ర్ సురేంద‌ర‌క్ రెడ్డిని లైన్ లో కి తీసుకొచ్చాడు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో స్పై థ్రిల్ల‌ర్ 'ఏజెంట్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణానికి 60 కోట్లు వెచ్చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సాంకేతికంగానూ సినిమాని హైలైట్ చేయాల్సి రావ‌డంతో! భారీ బ‌డ్జ‌ట్ ఖ‌ర్చు చేస్తున్నారు. ఎగ్జాటిక్ లోకేష‌న్ల‌లో షూటింగ్ చేస్తున్నారు.

అయితే అఖిల్ పై 60 కోట్లు వెచ్చించ‌డం అన్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అఖిల్ న‌టించినే సినిమాకి ఇంత మొత్తం ఖ‌ర్చు చేయ‌లేదు. నిర్మాణ ప‌రంగా 25 నుంచి 35 కోట్ల మ‌ధ్య‌లోనే ఖ‌ర్చు చేసారు. ఆ సినిమా ఫ‌లితాల్లో కొన్ని 50 కోట్ల లోపే బాక్సాఫీస్ వ‌ద్ద క‌నిపిస్తున్నాయి. మ‌రికొన్ని చిత్రాలు 30-40 కోట్ల మ‌ధ్య‌లోనే ఉన్నాయి.

బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన బ్యాచి ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద 51 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. ఈ సినిమా బ‌డ్జెట్ 21 కోట్లు. కానీ 'ఏజెంట్' కోసం సూరి నిర్మాణ‌ వ్య‌యాన్ని భారీగా పెంచారు. ఏకె ఎంట‌ర్ టైన్ మెం ట్స్-సురేంద‌ర్ -2 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సురేంద‌ర్ -2 సినిమాస్ అంటే సురేంద‌ర్ రెడ్డి బ్యాన‌ర్.

అంటే సూరి డైరెక్ట‌ర్ గా ఎలాంటి పారితోషికం తీసుకోకుండా త‌న రెమ్యున‌రేష‌న్నే ఇక్క‌డ పెట్టుబ‌డిగా పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ లెక్క‌ల్లో చూస్తే కేవ‌లం సూరి సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యంతోనే 'ఏజెంట్' 60 కోట్ల నిర్మాణంతో ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో 'ఏజెంట్' బాక్సాఫీస్ లెక్క కనీసం 100 కోట్లు.. ఆపై టార్గెట్ తోనైనా బ‌రిలోకి దిగాలి. అప్పుడే ఏజెంట్ గ‌ట్టేక్కేది.

బ్యాచిల‌ర్ స‌క్సెస్ నేప‌థ్యంలో 'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జ‌రిగడానికి ఛాన్స్ ఉంది. అక్కినేని బ్రాండ్-సూరి ఇమేజ్ తో కొంత వ‌ర‌కూ నెట్ట‌కొచ్చేస్తారు. మ‌రి ఆ క్లారిటీ రావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. క్వాలిటీలో ది బెస్ట్ ఇవ్వ‌డానికి సూరి ఎప్పుడూ ముందుంటారు. మేకింగ్ ప‌రంగానూ ఎక్కువ‌గానే స‌మ‌యాన్ని వెచ్చిస్తారు.

ఆక్ర‌మంలోనే 'ఏజెంట్' షూటింగ్ నెల‌ల త‌ర‌బ‌డి సాగుతోంది. ఇప్ప‌టికే ఏజెంట్ ప‌లుమార్లు రిలీజ్ తేదీలు ప్ర‌క‌టించిన వెనక్కి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆగ‌స్టు నుంచి సెప్టెంబర్ కి వాయిదా ప‌డుతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది.