షూటింగ్ పూర్తి అయ్యి 6 నెలలు.. యంగ్ హీరో 'ఫఫ' ఎక్కడ గురూ?

Sat Dec 03 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

6 months after completion of shooting.. Phalana Abbayi Phalana Ammayi Movie

నాగ శౌర్య హీరోగా మాళవిక నాయర్ హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందిన చిత్రం ఫఫ(ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి). షూటింగ్ పూర్తి అయ్యి దాదాపు ఆరు నెలలు అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో షూటింగ్ పూర్తి అయినట్లుగా అధికారికంగా ప్రకటిస్తూ ఫొటోలు షేర్ చేయడం జరిగింది.సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఈ మధ్య కాలంలో విడుదల తేదీలు ప్రకటిస్తూ హడావిడి చేస్తున్నారు. షూటింగ్ పూర్తి అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా విడుదల గురించి ఎలాంటి హడావుడి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ఇంతకు ఈ సినిమా ఏమయ్యింది.. ఎందుకు విడుదల గురించి చర్చ లేదు అనేది ఆసక్తిగా మారింది.

పీపుల్స్ మీడియా బ్యానర్ లో ఇప్పటికే పలు మంచి సినిమాలు వచ్చాయి. ఈ నిర్మాణ సంస్థ వద్ద ఆర్థిక వనరులు బాగానే ఉన్నట్లుగా సమాచారం.

అయినా కూడా ఎందుకు ఈ సినిమాను షూటింగ్ పూర్తి చేసిన తర్వాత విడుదల చేయకుండా హోల్డ్ లో ఉంచారు అనేది ఎవరికి అర్థం కాని పెద్ద ప్రశ్నగా మారింది.

నాగ శౌర్య మరియు అవసరాల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటీవల శౌర్య కొత్త సినిమా ప్రమోషన్ లో కూడా శ్రీనివాస్ అవసరాల పాల్గొన్నాడు. ఇద్దరి కాంబోలో ఒక ఫన్నీ ఇంటర్వ్యూ జరిగింది. హీరో దర్శకుడు మధ్య అంతా బాగానే ఉంది.. నిర్మాణ సంస్థ వైపు నుండి ఏమైనా సమస్యలా అనేది తెలియాల్సి ఉంది.

ఈ సినిమా విడుదల గురించి యూనిట్ సభ్యుల్లో ఏ ఒక్కరు అయినా స్పందించకపోవడంతో జనాలు ఈ సినిమా గురించి మర్చి పోయారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో తన గత చిత్రాలను తెరకెక్కించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమా తో కూడా ఆకట్టుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ సినిమా మాత్రం రాకుండా నిరాశ పర్చుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.