మిస్టరీ తెలిసింది: 6 రోజులు నిద్ర.. ఆపై తీవ్ర శృంగారం

Sat Jun 19 2021 06:00:01 GMT+0530 (IST)

6 days of sleep and then intense romance

వారంతా ఆరు రోజుల పాటు గాఢమైన నిద్రపోయారు. లేచాక శృంగారం కోసం పరితపించి తమ భాగస్వాములతో రెచ్చిపోయారట.. ఆరు రోజుల పాటు నిద్ర ఊరికే పోలేదు. దాని వెనుక ఒక మిస్టరీ దాగి ఉందని తాజాగా తేలింది.పాకిస్తాన్ పైనా.. రష్యా కింద ఉండే దేశాల్లో ఒకటైన కజికిస్తాన్ దేశంలో 2012లో ఒక వింత ఘటన వెలుగుచూసింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో గాని ఆ ఊర్లోని ప్రజలంతా దీర్ఘకాలిక నిద్రలో మునిగేవారట.. కొందరైతే 6 రోజులు పడుకునేవారట.. లేవగానే విపరీతమైన శృంగార వాంఛలతో తిరిగేవారు.

ఎందుకలా జరిగిందో మొదట్లో తెలియరాలేదు. వైద్యులు అధికారులు ఎంత ప్రయత్నించినా కనుక్కోలేదు. దీంతో పరిశోధించారు. కానీ ఆ విషయం తాజాగా ప్రభుత్వం జరిపించిన పరిశోధనల్లో తేలింది.

మొదట్లో కజికిస్తాన్ లోని కలాచీ ప్రాంతంలో యురేనియం మైనింగ్ చేశారు. ఆ మైనింగ్ నుంచి వచ్చే విషవాయువులే దీనికి కారణమని ప్రభుత్వం పరిశోధనలో తేలింది. ఆరు రోజుల పాటు గ్రామస్థులంతా నిద్రపోయి ఏడో రోజు లేచి శృంగారం కోసం పరితపించి ఆ తంతును ముగించారట.. ఆ తర్వాత ఈ సమస్య అక్కడ తగ్గిపోయింది.ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికీ అక్కడ మైనింగ్ సాగుతోంది. కానీ ఈ సమస్య మళ్లీ అక్కడ ఏర్పడలేదు.