Begin typing your search above and press return to search.

అనుష్క పేరుతో 51 లక్షల ఫ్రాడ్!

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:08 AM GMT
అనుష్క పేరుతో 51 లక్షల ఫ్రాడ్!
X
సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం, అక్కడ వందలో ఒకటి రెండు శాతం మాత్రమే సక్సెస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ సక్సెస్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు ఇదంతా ఒక ఎత్తు అయితే సినిమాల పేరుతో, సినిమా అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ అనుష్క డేట్స్ ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి ఏకంగా నిర్మాతను మోసం చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

అనుష్క డేట్స్ ఇప్పిస్తానని 51 లక్షలు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను తన సినిమా కోసం ఒప్పిస్తానని మరో 15 లక్షలు వసూలు చేసి తనను మోసం చేశాడు అంటూ లక్ష్మణ్ అనే నిర్మాత ఫిలిం ఛాంబర్ ను ఆశ్రయించాడు.

ఫిలిం ఛాంబర్ లో అందరి ముందు తన తప్పు ఒప్పుకుని తన తిరిగి డబ్బు ఇచ్చేందుకు సిద్ధమై ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడని డబ్బు అడిగితే ఇంట్లో ఆడవాళ్ళతో లైంగిక వేధింపులు కేసు పెట్టిస్తానని బెదిరించాడు అంటూ ఇప్పుడు లక్ష్మణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటీనటులను కూడా ఇలాంటి కేసులోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరూ బాగా డబ్బున్న పారిశ్రామికవేత్తలను ఎంచుకుని వారి పిల్లలకు మోడలింగ్ నేర్పిస్తామని మోడలింగ్ అవకాశాలు కూడా తామే కల్పిస్తామని మోసానికి దిగారు. ఏకంగా రష్మికతో కలిసి రాంప్ వాక్ చేసే అవకాశం కల్పిస్తామని చెబుతూ ఈ ముఠా అనేక మందిని మోసం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాదుకు చెందిన ఒక పారిశ్రామికవేత్తను కూడా వీరు బురిడీ కొట్టించారు. సుమారు 20 లక్షల రూపాయల మేర సదరు పారిశ్రామికవేత్త నుంచి వసూలు చేసి జారుకున్నారు. ఎన్నాళ్లు గడిచినా తమ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం లేదు సరి కదా కాల్ చేస్తే కాల్ కూడా అటెండ్ చేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు పారిశ్రామికవేత్త వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సదరు బాలీవుడ్ నటి, నటుడిని అరెస్ట్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.